Hot Water Side Effects: బరువు తగ్గడం కోసం వేడినీటిని ఎక్కువగా తాగుతున్నారా..!

Hot Water Side Effects: ఈ రోజుల్లో బరువు తగ్గడానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

Update: 2022-11-11 00:45 GMT

Hot Water Side Effects: బరువు తగ్గడం కోసం వేడినీటిని ఎక్కువగా తాగుతున్నారా..!

Hot Water Side Effects: ఈ రోజుల్లో బరువు తగ్గడానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొంతమంది పరగడుపున మాత్రమే కాకుండా రోజుమొత్తం వేడినీళ్లు తాగుతుంటారు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం అయితే ఇందుకోసం వేడి నీటిని తాగడం మంచిది కాదు. ఇది ఆరోగ్యానికి హానికరం. ఎక్కువగా వేడినీరు తాగడం వల్ల కలిగే అనర్థాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.

వేడి నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు

వేడి నీళ్ళు నోటిలో గాయాలని కలిగిస్తాయి. వీటిని ఎక్కువగా తాగడం వల్ల నోరు మండుతుంది. వేడినీరు ఎక్కువగా తాగితే ఏకాగ్రతపై ప్రభావం పడుతుంది. కిడ్నీలు దెబ్బతింటాయి. బరువు త్వరగా తగ్గుతుందని భావించి వేడి నీటిని ఎక్కువగా తాగడం మంచిదికాదు. ఇలా చేయడం వల్ల కిడ్నీలు పాడవుతాయి. ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

వేడి నీళ్లకు బదులు గోరువెచ్చని నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ఎటువంటి హాని కలిగించవు. పైగా చాలా సమస్యలని నివారిస్తాయి. అయితే వీటిని రోజు మొత్తం తాగకూడదు. ఉదయం, సాయంత్రం తీసుకుంటే సరిపోతుంది. బరువు తగ్గుతారని రోజు మొత్తం తీసుకుంటే నష్టాలే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి. ఇవికాక కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా వేడినీటికి దూరంగా ఉండాలి. లేదంటే సమస్య మరింత తీవ్రమవుతుంది.

Tags:    

Similar News