Health Tips: నిద్రపోయేముందు పాలు తాగుతున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి..!
* పాలు జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలని సృష్టిస్తుంది. నిద్రకి ముందు పాలు తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
Health Tips: పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెబుతారు. అయితే నిద్రకి ముందు పాలు తాగడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. పాలు జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలని సృష్టిస్తుంది. నిద్రకి ముందు పాలు తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
చాలా మంది నిద్రకి ముందు పాలు తాగుతారు. దీనివల్ల మంచి నిద్ర వస్తుందని నమ్ముతారు. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇది నిద్రకు ప్రయోజనకరంగా ఉంటుంది కానీ జీర్ణవ్యవస్థకు హానికరంగా మారుతుంది. పడుకునేటప్పుడు పాలు తాగడం వల్ల పాలు సరిగా జీర్ణం కావు. ఇవి పెద్ద ప్రేగులలోకి చేరడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదు. చాలామంది రాత్రి భోజనం నిద్రకు కొద్దిసేపటి ముందు చేస్తారు. రాత్రి భోజనం తర్వాత పాలు తాగితే శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. పాలలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను పెంచుతాయి.
నిద్రకి ముందు పాలు తాగడం వల్ల కేలరీలు బర్న్ అవ్వవు. దీంతో బరువు పెరగడం ప్రారంభమవుతుంది. రాత్రి నిద్రించడానికి 2 నుంచి 4 గంటల ముందు పాలు తాగాలి. తద్వారా పాలు సక్రమంగా జీర్ణం అవుతాయి. బరువు కూడా పెరగరు. కానీ తిన్న వెంటనే పాలు తాగకూడదు. ఇది మంచి పద్దతి కాదు. ఆరోగ్యానికి హానికరం కూడా.