Health Tips: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా.. ఆరోగ్యానికి పెద్ద నష్టం..!

Health Tips: వాతావరణం ఏదైనా సరే శరీరం హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం.

Update: 2023-01-19 06:48 GMT

Health Tips: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా.. ఆరోగ్యానికి పెద్ద నష్టం..!

Health Tips: వాతావరణం ఏదైనా సరే శరీరం హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. చలికాలంలో మనం వేడి పానీయాలు ఎక్కువగా తీసుకుంటే అవి మన శరీరాన్ని డీ హైడ్రేషన్‌ చేస్తాయి. ఎందుకంటే ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. దీని వల్ల అనేక రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. చలికాలంలో శరీరాన్ని ఎలా హైడ్రేట్‌గా ఉంచుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

చలికాలంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి ఉత్తమమైన మార్గం అధికంగా నీరు తాగడం. వాస్తవానికి చలిలో నీళ్లు తాగడం కష్టంగా ఉంటుంది. అయితే దీన్ని రుచిగా మార్చడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఉదాహరణకు, నిమ్మరసం లేదా ఇతర పండ్ల రసాన్ని తీసుకొని శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవచ్చ. వేసవితో పోలిస్తే చలికాలంలో ఎక్కువగా చెమట పట్టదు.

దీనివల్ల శరీరంలో ఉప్పు పేరుకుపోతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. చలికాలంలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో హైడ్రేట్‌గా ఉండటానికి నీరు మాత్రమే సరిపోదు కాబట్టి రోజువారీ ఆహారంలో నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో నీటి కొరతను అధిగమించవచ్చు.

కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల మూత్రవిసర్జన ఎక్కువగా చేయాల్సి వస్తుంది. చలికాలంలో శరీరం డీహైడ్రేషన్‌కు ఇది కూడా ఒక ప్రధాన కారణం. శీతాకాలంలో కెఫిన్ కలిగిన పానీయాల తీసుకోవడం తగ్గించడం వల్ల శరీరంలోని నీటి పరిమాణం తగినంతగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం కెఫీన్ మానుకోండి. ఉదయాన్నే ఒక కప్పు హెర్బల్ టీ ప్రయోజనకరంగా ఉంటుంది.

Tags:    

Similar News