Gym Workouts: జిమ్‌లో అధికంగా వర్కవుట్స్‌ చేస్తున్నారా.. ప్రమాదం మీ వెంటే జాగ్రత్త..!

Gym Workouts:జిమ్‌లో అధికంగా వర్కవుట్స్‌ చేస్తున్నారా.. ప్రమాదం మీ వెంటే జాగ్రత్త..!

Update: 2022-08-14 06:47 GMT

Gym Workouts: జిమ్‌లో అధికంగా వర్కవుట్స్‌ చేస్తున్నారా.. ప్రమాదం మీ వెంటే జాగ్రత్త..!

Gym Workouts: ఇటీవల సెలబ్రిటీలు జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ అనూహ్యంగా గుండెపోటుకి గురవుతున్నారు. ఇటీవల జిమ్‌లో వర్కవుట్‌లు చేస్తూ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ్ అకస్మాత్తుగా గుండెపోటుకి గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. అంతేకాదు గాయకుడు కెకె గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గతేడాది నటుడు పునీత్ రాజ్‌కుమార్ జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూనే కార్డియాక్‌ అరెస్ట్‌కి గురై మరణించిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి జిమ్‌లో భారీ వర్కౌట్స్ చేయడంతో అతని పరిస్థితి క్షీణించింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి అక్కడే తుది శ్వాస విడిచాడు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఎన్నో ఉదంతాలు జరిగాయి. అందుకే జిమ్ లేదా వర్కౌట్ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు శరీరంలో ఏదైనా అనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. 40 ఏళ్ల తర్వాత క్రమం తప్పకుండా చెకప్‌లు చేసుకుంటూ ఉండాలి. జిమ్ చేసేవారికి ఇది చాలా ముఖ్యం.

అలాగే వర్కౌట్‌లు చేస్తున్నప్పుడు హృదయ స్పందన రేటును పర్యవేక్షించండి. దీని కోసం మీరు స్మార్ట్ వాచ్ ధరించవచ్చు. ఇందులో మీ హృదయ స్పందన రేటును తనిఖీ చేసుకోవచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు హృదయ స్పందన రేటు 120 నుంచి 180కి చేరినట్లు గమనించినట్లయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. గుండె కొట్టుకునే వేగం మందగించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు

1. గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్లు అనిపించడం

2. అయోమయంగా ఉండటం

3. విపరీతంగా చెమటలు పట్టడం

4. బలహీనంగా అనిపించడం

5. తల తిరుగుతున్నట్లు అనిపించడం

6. ఛాతి నొప్పి

7. కళ్ల ముందు చీకటిగా ఉండటం

Tags:    

Similar News