Health Tips: చక్కెరకి బాగా అలవాటు పడ్డారా.. ఈ చిట్కాలతో నియంత్రించండి..!

Health Tips: చక్కెరని వైట్‌పాయిజన్‌గా పిలుస్తారు.

Update: 2023-01-22 06:18 GMT

Health Tips: చక్కెరకి బాగా అలవాటు పడ్డారా.. ఈ చిట్కాలతో నియంత్రించండి..!

Health Tips: చక్కెరని వైట్‌పాయిజన్‌గా పిలుస్తారు. దీనికి బానిసలుగా మారితే బయటికి రావడం చాలా కష్టం. ముఖ్యంగా దేశంలో షుగర్‌ పేషెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నారు. మార్కెట్‌లో సహజసిద్దమైన చక్కెర లభించడం లేదు. దీనికి రకరకాల కెమికల్స్‌ కలిపి అమ్ముతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల రకరకాల వ్యాధులకి గురవుతున్నారు. అయితే నిత్య జీవితంలో చక్కెరని నియంత్రించవచ్చు. దీనికి బదులుగా సహజసిద్దమైన తీపిని పదార్థాలని ఉపయోగించవచ్చు. అలాంటి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చక్కెర లేని స్వీట్లని ఊహించడం కొంచెం కష్టమే. కానీ కొన్ని ఉన్నాయి. మీరు బేకరీ స్వీట్ ఐటమ్స్ తినడానికి ఇష్టపడితే వాటికి బదులుగా ఖర్జూరం లేదా జీడిపప్పు, పిస్తా, బాదం వంటి గింజలను తినడం ప్రారంభించండి. మార్కెట్‌లో చక్కెరతో కాకుండా స్వీట్‌లేని బిస్కెట్లు కూడా లభిస్తాయి. వీటిని తినడం అలవాటు చేసుకోండి.

అలాగే మీరు ఏదైనా ఆహారాలని కెచప్‌తో తినే అలవాటు ఉంటే మానుకోండి. కెచప్‌కి బదులు ఇంట్లో దొరికే చట్నీని తీసుకోండి. ఇది రుచితోపాటు ఆరోగ్యకరమైనది. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. మీకు స్వీట్లు బాగా ఇష్టమైతే ఈ అలవాటును వదిలేయండి. ఎందుకంటే వీటి తయారీలో శుద్ధి చేసిన చక్కెరను ఉపయోగిస్తారు. వీటికి బదులుగా సీజనల్ పండ్లను తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.

శీతల పానీయంలో చక్కెర, సోడా రెండూ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటికి బదులుగా సహజ చక్కెరను కలిగి ఉన్న కొబ్బరి నీటిని తాగవచ్చు. దీనివల్ల రక్తంలో చక్కెరశాతం పెరగదు. పైగా రుచికి రుచి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే కర్జూరతో ఇంట్లో లడ్డులు తయారుచేసుకోవచ్చు. వీటివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Tags:    

Similar News