Skin Care Tips: ఇన్‌స్టంట్‌గా ముఖం మెరవాలంటే ఈ నిమ్మకాయ రెమిడీ సూపర్‌..!

Skin Care Tips: నిమ్మకాయ చర్మ సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది.

Update: 2023-06-02 09:48 GMT

Skin Care Tips: ఇన్‌స్టంట్‌గా ముఖం మెరవాలంటే ఈ నిమ్మకాయ రెమిడీ సూపర్‌..!

Skin Care Tips: నిమ్మకాయలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్‌ సి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. నిమ్మకాయ చర్మ సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. ముఖానికి నిమ్మకాయ, ఉప్పును అప్లై చేస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఉప్పు చర్మం నుంచి మృతకణాలని తొలగించడంలో సహాయపడుతుంది. విటమిన్‌ సి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహకరిస్తుంది. నిమ్మ, ఉప్పును ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

డెడ్ స్కిన్ తొలగిపోతుంది

నిమ్మ, ఉప్పు మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. నిమ్మకాయలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఏజింగ్ గుణాలు చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి. ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతాయి.

జిడ్డు ఆయిల్‌ తొలగిపోతుంది

నిమ్మ, ఉప్పును ముఖంపై అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే జిడ్డు ఆయిల్‌ తొలగిపోతుంది. మొటిమల సమస్యను కూడా తొలగిపోతుంది. జిడ్డుగల ముఖంతో ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ ముఖానికి నిమ్మకాయ, ఉప్పును అప్లై చేయవచ్చు.

ముడతలు తొలగిపోతాయి

నిమ్మ, ఉప్పు కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ తొలగిపోతాయి. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు చర్మం ముడతలను తగ్గించి ఛాయను మెరుగుపరిచేందుకు పని చేస్తాయి.

నిమ్మ, ఉప్పు ఫేస్‌ ప్యాక్‌

నిమ్మ, ఉప్పును ముఖానికి పట్టించాలంటే రెండు చెంచాల నిమ్మరసం, చిన్న చెంచా ఉప్పును ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయాలి. తర్వాత తేలికపాటి చేతులతో స్క్రబ్ చేసి 15 నిమిషాల తర్వాత ముఖం కడుకవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

Tags:    

Similar News