Fitness Tips: జీవితంలో ఫిట్‌గా ఉండాలంటే 9-1 నియమం అప్లై చేయండి.. ఏ టెన్షన్‌ ఉండదు..!

Fitness Tips: లైఫ్‌లో ఫిట్‌గా ఉండాలంటే కొన్ని పద్దతులు కచ్చితంగా పాటించాలి. లేదంటే అందరిలాగే రోగాలకు గురై ఇబ్బంది పడుతుంటాం.

Update: 2023-12-14 16:00 GMT

Fitness Tips: జీవితంలో ఫిట్‌గా ఉండాలంటే 9-1 నియమం అప్లై చేయండి.. ఏ టెన్షన్‌ ఉండదు..!

Fitness Tips: లైఫ్‌లో ఫిట్‌గా ఉండాలంటే కొన్ని పద్దతులు కచ్చితంగా పాటించాలి. లేదంటే అందరిలాగే రోగాలకు గురై ఇబ్బంది పడుతుంటాం. మిగతా వారికంటే మనం భిన్నంగా కనిపించాలంటే కచ్చితంగా 9-1 నియమాన్ని అనుసరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. 9-1 నియమంలోమొత్తం 9 నియమాలు చెప్పారు. ఇవి దీర్ఘకాలంలో శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

9-1 నియమాల వివరణ

9. ఇది 9-1 నియమంలో మొదటి నియమం. ఇందులో 9 అంటే రోజులో దాదాపు 9,000 అడుగులు నడవడం. ఇది పూర్తి శరీర కదలికను కలిగిస్తుంది.

8. రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు కచ్చితంగా తాగాలని చెబుతారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది.

7. తగినంత నిద్ర తీసుకోవడం వల్ల రోజంతా అలసట, బలహీనత తొలగిపోతుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అందువల్ల ప్రతిరోజూ కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి.

6. మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు కనీసం 6 నిమిషాలు ధ్యానం చేయాలి. ఇది ఒత్తిడి-ఆందోళన నుంచి ఉపశమనం అందిస్తుంది. శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది.

5. ఆరోగ్యకరమైన ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. రోజుకు 5 సూపర్‌ ఫుడ్స్‌ తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

4. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేసేవారు రోజుకు నాలుగు గంటలు అటూ ఇటు నడవాలి. దీనివల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

3. రోజుకు కనీసం మూడు షార్ట్ మీల్స్ ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల శరీరానికి సరైన సమయంలో పోషకాహారం అందుతుంది.

2. రోజులో కనీసం 2-3 గంటల విరామం ఉండాలి. ఇది మొదటి భోజనం జీర్ణం కావడానికి, శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడుతుంది.

1. రోజులో కొంత శారీరక శ్రమ తప్పక చేయాలి. ఇది రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. రోజు ఒక గంట వ్యాయామానికి కేటాయించాలి.

Tags:    

Similar News