Anger: కోపం అన్ని అనర్థాలకి కారణం.. ఇలా నియంత్రించుకోండి..!
Anger: ఎంత చదువుకున్న వ్యక్తి అయినా కోపాన్ని అదుపు చేసుకోలేకపోతే చాలా సమస్యలలో చిక్కుకుంటాడు
Anger: ఎంత చదువుకున్న వ్యక్తి అయినా కోపాన్ని అదుపు చేసుకోలేకపోతే చాలా సమస్యలలో చిక్కుకుంటాడు. ఇది మన జీవితాల్లో చాలా నష్టాలని కలిగిస్తుంది. మనల్ని మనం నియంత్రించుకోలేకపోతే జీవితంలో విజయం సాధించడం చాలా కష్టం. కోపం ఒక భావోద్వేగం కావచ్చు. కానీ అది ప్రమాదకర స్థాయికి చేరుకుంటే చాలా అనర్థాలకి కారణం అవుతుంది. కోపాన్ని అదుపు చేసేందుకు ఎలాంటి పద్ధతులను అవలంభించాలో తెలుసుకుందాం.
1. వ్యాయామం
సాధారణంగా కోపాన్ని తగ్గించుకోవడానికి వ్యాయామం అత్యంత ప్రభావవంతమైన మార్. ఇది మనస్సులో సానుకూలతను తెస్తుంది. ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేయాలి.
2. సమస్యను చెప్పండి
మీరు మీ సమస్యను మిత్రుడు లేదా బంధువుతో చెప్పినప్పుడు మీ కోపం కొంతవరకు తగ్గుతుంది. ఇది కోపాన్ని నియంత్రించే ఒక చిట్కాగా చెప్పవచ్చు.
3. లోతైన శ్వాస
మీకు కోపం బాగా వచ్చినప్పుడు లోతైన శ్వాస తీసుకోండి. మీరు పూర్తిగా రిలాక్స్ అవుతారు. కోపం తగ్గే వరకు ఈ ప్రక్రియను కొనసాగించండి.
4. పంచింగ్ బ్యాగ్
జపాన్‌లోని చాలా కార్యాలయాల్లో పంచింగ్ బ్యాగ్ ఉంటుంది. అంటే మీకు ఏదైనా సీనియర్ లేదా బాస్‌పై కోపం వస్తే ఈ పంచింగ్ బ్యాగ్‌పై ప్రతాపం చూపిస్తారు. మీరు మీ ఇంట్లో కూడా ఈ ట్రిక్ ప్రయత్నించవచ్చు. ఇది కోపాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
5. యోగా, ధ్యానం
మానసిక ఆరోగ్యానికి యోగా లేదా ధ్యానం చాలా ముఖ్యం. తరచుగా కోపానికి గురయ్యే వారికి మనశ్శాంతి కరువవుతుంది. అప్పుడు యోగా లేదా ధ్యానం చేస్తే దీని నుంచి బయటపడవచ్చు.