చలికాలంలో ఉసిరి అమృతం లాంటిది.. ప్రయోజనాలు తెలిస్తే నిజమే అంటారు..
Amla Benefits: చలికాలంలో ఉసిరి అమృతం లాంటిది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.
Amla Benefits: చలికాలంలో ఉసిరి అమృతం లాంటిది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ సీజన్‌లో వచ్చే చాలా వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఉసిరిని పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో విరివిగా వాడేవారు. దీంతో మాత్రలను తయారుచేసేవారు. ఉసిరిలో పాలీఫెనాల్స్, విటమిన్ సి అధికంగా ఉంటుంది.
ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. అంతేకాదు.. ఆక్సీకరణ ఒత్తిడి నుండి కూడా రక్షిస్తుంది. మెరుగైన మెటబాలిజం నిర్వహించడానికి సహాయపడుతుంది.
కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భయాందోళనల మధ్య అందురు సురక్షితంగా ఉండటం ముఖ్యం. అందుకోసం రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. దీనికి ఉసిరి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా ఉసిరి శరీరాన్ని అనేక రకాల వైరస్ల నుంచి రక్షిస్తుంది. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.
గుండె రోగులకు కూడా ఉసిరి వినియోగం చాలా మేలు చేస్తుంది. ఇది గుండె కండరాలను బలపరుస్తుంది, రక్త ప్రసరణను పెంచుతుంది నాళాలలో అడ్డంకిని తొలగిస్తుంది. గుండె జబ్బులున్నవారు ఉసిరిని తమ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
ఉసిరిలో క్రోమియం అనే మూలకం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే మధుమేహ రోగులు ప్రతిరోజు ఉసిరికాయ తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.
మీరు ఉసిరిని నేరుగా తినలేకపోతే పొడిగా చేసుకొని, క్యాప్సూల్స్‌గా, జామ్, జ్యూస్ లేదా ఎలాగైనా తినవచ్చు.మీ నోటిలో తరచుగా పొక్కులు వస్తుంటే మీరు ఖచ్చితంగా ఉసిరి తినాలి. ఉసిరి రసం మీ పొట్ట సమస్యలను దూరం చేయడంతో పాటు వేడిని తగ్గిస్తుంది. ఇది అల్సర్లలో ఉపశమనం కలిగిస్తుంది.