Body Massage: బాడీ మసాజ్‌తో అద్భుత ఫలితాలు.. ఈ ఆరోగ్య సమస్యలపై కచ్చితమైన ప్రభావం..!

Body Massage: ఈ రోజుల్లో చాలామంది కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల ముందు గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువ సమయం గడుపుతారు.

Update: 2023-08-02 16:00 GMT

Body Massage: బాడీ మసాజ్‌తో అద్భుత ఫలితాలు.. ఈ ఆరోగ్య సమస్యలపై కచ్చితమైన ప్రభావం..!

Body Massage: ఈ రోజుల్లో చాలామంది కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల ముందు గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువ సమయం గడుపుతారు. వీరందరికి శరీరంలో చాలా నొప్పులు ఏర్పడుతాయి. కొన్నిసార్లు జీర్ణక్రియ సమస్యలు, మానసిక ఒత్తిడిలు కూడా ఎదురవుతాయి. ఈ నొప్పులని తగ్గించుకోవడానికి చాలామంది టాబ్లెట్లపై ఆధారపడుతారు. కానీ దీనివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అందుకే ఆయుర్వేదం ప్రకారం శరీరానికి ఆయిల్ మసాజ్ చేసుకుంటే లెక్కలేనన్ని ప్రయోజనాలను పొందుతారు.

వాస్తవానికి శరీరం కూడా ఒక యంత్రం లాంటిది. దీనికి కూడా విశ్రాంతి అవసరం. నెలలో 4 నుంచి 5 సార్లు బాడీ మసాజ్ చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. బాడీ మసాజ్ శరీరంలోని అన్ని భాగాలను సరిగ్గా పని చేసేలా చేస్తుంది. మంచి విశ్రాంతి లభిస్తుంది. మానసికంగా ధృడంగా తయారవుతారు. బాడీ మసాజ్ వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

కండరాలు రిలాక్స్ అవుతాయి

క్రమం తప్పకుండా బాడీ మసాజ్ లేదా ఆయిల్ మసాజ్ చేస్తే కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది. దీని వల్ల మూడ్ తాజాగా ఉంటుంది. అంతే కాదు శరీరంతో పాటు మనసు కూడా రిలాక్స్ అవుతుంది. నిజానికి మసాజ్ ఒక థెరపీలా పనిచేస్తుంది. వారానికి ఒకసారి మసాజ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ, ఫ్లెక్సిబిలిటీ మెరుగవుతుంది.

బీపీ కంట్రోల్‌

బాడీ మసాజ్‌తో అధిక రక్తపోటు సమస్య తొలగిపోతుంది. అందుకే బీపీ సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా మసాజ్ చేయించుకోవాలి. ఆయిల్ మసాజ్ గుండె ఆరోగ్యాన్ని కూడా బాగుచేస్తుంది. ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

రోగనిరోధక శక్తి పెరుగుదల

ఒక పరిశోధన ప్రకారం ఒక వ్యక్తి శరీరానికి క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే రోగనిరోధక శక్ విపరీతంగా పెరుగుతుందని తేలింది. అలాగే అతను అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి దూరంగా ఉంటాడు. నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపిస్తాడు.

Tags:    

Similar News