Green Tomato: గ్రీన్ టమోటాతో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్.. అవేంటంటే?

Green Tomato: సాధారణంగా ఎర్ర టమోటాలను అందరు వినియోగిస్తారు. కర్రీ, టిఫిన్స్‌, స్నాక్స్‌ ప్రతి దానిలో వినియోగిస్తారు.

Update: 2022-01-29 07:57 GMT

Green Tomato: గ్రీన్ టమోటాతో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్.. అవేంటంటే?

Green Tomato: సాధారణంగా ఎర్ర టమోటాలను అందరు వినియోగిస్తారు. కర్రీ, టిఫిన్స్‌, స్నాక్స్‌ ప్రతి దానిలో వినియోగిస్తారు. కానీ గ్రీన్ టమోటాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇందులో విటమిన్ సి , ఎ, కాల్షియం, పొటాషియం మెండుగా ఉంటాయి. అయితే ఇందులోని రసం కొంచెం వగరుగా ఉండటం వల్ల చాలామంది వీటిని ఇష్టపడరు. కానీ ఇవి రోగనిరోధక శక్తిని అమాంతం పెంచేస్తాయి. అందుకే వైద్యనిపుణులు గ్రీన్‌ టమోటాలను తినమని సలహా ఇస్తారు.

కరోనా కాలంలో అందరు ఆరోగ్యంపై బాగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తిలేకుంటే వైరస్‌ అటాక్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచిస్తున్నారు. అయితే గ్రీన్ టమోటాలో విటమిన్‌ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని సులువుగా పెంచేస్తుంది. అంతేకాదు కళ్లకు చాలా ముఖ్యమైనదిగా భావించే బీటా కెరోటిన్ పచ్చి టొమాటోల్లో పెద్ద మొత్తంలో ఉంటుంది. బీటా కెరోటిన్‌తో కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు దృష్టి కూడా మెరుగవుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు గ్రీన్‌ టమోటా తింటే చాలా మంచిది.

పట్టణాలు, సిటీలలో కాలుష్యం కారణంగా చర్మంపై మొటిమలు, నల్లమచ్చల సమస్య సర్వసాధారణమైపోయింది. ప్రజలు ఈ సమస్య నుంచి బయటపడటానికి వివిధ రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. కానీ మీరు వాటికి బదులుగా గ్రీన్ టొమాటోలు వినియోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. చర్మానికి చాలా ముఖ్యమైనదిగా భావించే విటమిన్ సి ఇందులో పుష్కలంగా ఉంటుంది. అలాగే దాని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతేకాదు ప్రస్తుతం చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. దీని కోసం మందులు కూడా వాడుతున్నారు. అయితే ఈ మందులు అనేక విధాలుగా ఆరోగ్యానికి హానికరం. ఈ పరిస్థితిలో ఆకుపచ్చ టమోటాలతో రక్తపోటును నియంత్రించవచ్చు. ఇందులో ఉండే పొటాషియంతో రక్తపోటును అదుపు చేయవచ్చు.

Tags:    

Similar News