Health Tips: బిరియాని ఆకులో అద్భుత ఔషధ గుణాలు.. ఈ వ్యాధులకి దివ్య ఔషధం..!
Health Tips: బిరియాని ఆకులో అద్భుత ఔషధ గుణాలు.. ఈ వ్యాధులకి దివ్య ఔషధం..!
Health Tips: చలికాలంలో చాలా మంది జలుబు, ఫ్లూతో ఇబ్బంది పడుతుంటారు. వంటింట్లో లభించే బిరియాని ఆకులు ఈ సమస్యలని పరిష్కరించగలవు. ఈ ఆకు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటుంది. దీనిని వేడి మసాలాగా ఉపయోగిస్తారు. బిరియాని ఆకులో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీని కారణంగా ఇది మీకు అనేక విధాలుగా పనిచేస్తుంది. బిరియాని ఆకు ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి పెంచుతుంది
బిరియాని ఆకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది విటమిన్ ఎ, బి6, విటమిన్ సి వంటి పోషకాలని కలిగి ఉంటుంది. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
జీర్ణక్రియ బలోపేతం
బిరియాని ఆకు మన జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది కడుపు నొప్పిని నయం చేస్తుంది. బిరియాని ఆకు టీ జలుబుని తగ్గిస్తుంది.
సైనస్ నుంచి ఉపశమనం
బిరియాని ఆకు ముక్కు కారటం సమస్యను త్వరగా నయం చేస్తుంది. మిరియాలు, బిరియాని ఆకులని బాగా మరిగించి టీ మాదిరి తీసుకుంటే సైనస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
మధుమేహం
బిరియాని ఆకులతో చేసిన క్యాప్సూల్‌ను టీలో కలిపి తాగడం వల్ల రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకి దివ్య ఔషధం లాంటిది.
కొలెస్ట్రాల్
బిరియాని ఆకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కెఫీక్ అనే ఆర్గానిక్ సమ్మేళనం ఇందులో కనుగొన్నారు. ఇది గుండెకు చాలా మంచిదిగా చెబుతారు.