ఉసిరిలో అద్భుత ఔషధ గుణాలు.. చలికాలం వచ్చే ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం..
Amla Benefits: ఆమ్లా చ్యవన్‌ప్రాష్ తినడం వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Amla Benefits: చలికాలం మొదలైంది ఈ సీజన్‌లో రకరకాల ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అందుకే ఆయుర్వేద నిపుణులు ఈ కాలంలో ఉసిరిని చాలా ప్రయోజకరంగా భావిస్తారు. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ సీజన్‌లో సాధారణంగా వచ్చే జుట్టు రాలడం, ఎసిడిటీ, బరువు పెరగడం, ఇతర సమస్యలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
1. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
చలికాలంలో ఉసిరి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆమ్లా చ్యవన్‌ప్రాష్ తినడం వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులతో పోరాడడంలో మీ శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది.
2. మలబద్ధకం ఉపశమనం
చలి కాలంలో మలబద్ధకం సమస్య చాలా సాధారణం. ఉసిరి మలబద్దకాన్ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది పొట్టకు జీర్ణ సమస్యలను తొలగించి మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.
3. జుట్టు రాలే సమస్య
శీతాకాలంలో వచ్చే మరో సాధారణ సమస్య జుట్టు రాలడం. ఆమ్లాలో ఉండే ఔషధాలు జుట్టు రాలడాన్ని ఆపివేసే మూలాల నుంచి జుట్టును బలపరుస్తాయి. ఇది జుట్టుకు పోషణను అందించడమే కాకుండా బలంగా చేస్తుంది.