Turmeric Water: ప్రతిరోజు పసుపు నీరు తాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

* పసుపుని దశాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. *పసుపులో ఉండే కర్కుమిన్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Update: 2021-11-28 04:33 GMT

పసుపు నీరు(ఫైల్ ఫోటో)

Turmeric Water: ప్రతి భారతీయుడి ఇంటిలో పసుపు కచ్చితంగా ఉంటుంది. దీనిని ఎక్కువగా వంటలలో ఉపయోగిస్తారు. ఇది ఆహారానికి రంగును, రుచిని జోడించడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. పసుపుని దశాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. ఆయుర్వేదంలో ఔషధాల తయారీకి వినియోగిస్తున్నారు. పసుపు నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కాలానుగుణ జలుబు, ఫ్లూని దూరంగా ఉంచుతుంది.

1. ఆర్థరైటిస్ నొప్పి

ఈ రోజు స్త్రీలలో కీళ్ల నొప్పులు సాధారణ సమస్య. ప్రతిరోజు పసుపు నీరు తాగితే ఈ సమస్య నుంచి దూరం కావొచ్చు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

పసుపులో ఉండే కర్కుమిన్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది ఫ్రీ-రాడికల్ నష్టాన్ని నివారిస్తుంది. వ్యాధులను దూరంగా ఉంచుతుంది.

3. బరువుని తగ్గిస్తుంది

బరువు తగ్గడానికి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం అవసరం. మీ ఆహారంలో పసుపును చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దానిని నీటితో తీసుకుంటే మీ జీవక్రియను మరింత పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

4. చర్మానికి మంచిది

పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీ చర్మానికి గ్లోని తీసుకువస్తాయి. పసుపు నీటిని తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే మీ చర్మాన్ని యవ్వనంగా ప్రకాశవంతంగా ఉంచుతుంది.

5. పసుపు నీటిని తయారు చేయడం

ఒక చిన్న పాన్ తీసుకుని అందులో ఒక కప్పు నీళ్లు పోసి మరిగించాలి. ఇప్పుడు 2 చిటికెల పసుపు వేసి కలపాలి. 1-2 నిమిషాలు మరగనివ్వాలి. నీటిని వడపోసి రుచిగా ఉండటానికి కొద్దిగా తేనెను కలుపుకొని తాగవచ్చు.

Tags:    

Similar News