Raw Milk: పచ్చిపాలతో ముఖంపై అద్భుతమైన గ్లో.. ఇలా అప్లై చేస్తే చాలు..!

Raw Milk: పాలు సంపూర్ణ ఆహారం. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. చర్మ సంరక్షణకి కూడా తోడ్పడుతాయి.

Update: 2023-05-30 15:00 GMT

Raw Milk: పచ్చిపాలతో ముఖంపై అద్భుతమైన గ్లో.. ఇలా అప్లై చేస్తే చాలు..!

Raw Milk: పాలు సంపూర్ణ ఆహారం. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. చర్మ సంరక్షణకి కూడా తోడ్పడుతాయి. పాలని అనేక సౌందర్య ఉత్పత్తులలో వినియోగిస్తారు. మారుతున్న సీజన్‌లో స్కిన్‌ కాపాడుకోవడం చాలా ముఖ్యం. సరిగ్గా ముఖం కడుక్కోవడం, క్రీమ్ అప్లై చేయడం, వారానికోసారి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే వీటికన్నా పచ్చిపాలని వాడితే చర్మానికి అద్భుతమైన గ్లో వస్తుంది. అయితే వీటిని ఎలా అప్లై చేయాలో ఈరోజు తెలుసుకుందాం.

1. పచ్చి పాలతో ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో 2 లేదా 4 చెంచాల పచ్చి పాలను తీసుకోవాలి. అందులో సగం అరటిపండు వేయాలి. తర్వాత ముఖానికి మాస్క్ లాగా అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇది చర్మాన్ని మృదువుగా, బిగుతుగా మార్చుతుంది.

2. పచ్చి పాలలో టమోటా గుజ్జు కలిపి ముఖానికి రాసుకుంటే వారం రోజుల్లో మచ్చలు మాయమవుతాయి. ముఖంలో మెరుపు కూడా వస్తుంది. ఈ ఫేస్‌ ప్యాక్‌ని అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా మారుతుంది. ఇందులో విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

3. పచ్చి పాలను ఫేస్ క్లెన్సర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీంతో ముఖంలోని మురికి మొత్తం తొలగిపోతుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ యాంటీ ఏజింగ్ ఫేస్ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. ఇది చనిపోయిన మృత కణాలని తొలగించడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News