Health Tips: పుచ్చకాయ గింజలు వీరికి దివ్యౌషధం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Health Tips: పుచ్చకాయ గింజలు వీరికి దివ్యౌషధం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Update: 2023-02-22 01:30 GMT

Health Tips: పుచ్చకాయ గింజలు వీరికి దివ్యౌషధం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Health Tips: వివాహం తర్వాత పురుషులు వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మారిన జీవనపరిస్థితులు, ఆహార విధానం, చెడు అలవాట్లు ఈ పరిస్థితిని దెబ్బతీస్తాయి. దీంతో తండ్రి కావాలనే అతని కోరికని నిలువరిస్తాయి. నేటి కాలంలో దాదాపు చాలామంది ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి పుచ్చకాయ గింజలు అద్భుత పరిష్కారమని చెప్పవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

వేసవి కాలంలో అందరు పుచ్చకాయని తింటారు. దీని వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. మనలో చాలా మందికి ఈ జ్యూసీ ఫ్రూట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసు. కానీ ఇందులో ఉండే నల్ల గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎవ్వరికి తెలియదు. పుచ్చకాయ గింజలు పురుషుల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి స్పెర్మ్ కౌంట్ పెంచుతాయి. ఒక వ్యక్తికి సంతాన సమస్యలు ఉంటే అతను ఈ పండు విత్తనాలను తప్పనిసరిగా తినాలి.

పుచ్చకాయ గింజలు ప్రోటీన్, సెలీనియం, జింక్, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీసాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. స్పెర్మ్ కౌంట్ మెరుగవుతుంది. ఇందులో ఉండే సిట్రులిన్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ గింజలలో జింక్ లభిస్తుంది. ఇది స్పెర్మ్ నాణ్యతని మెరుగుపరుస్తుంది.

పుచ్చకాయ గింజలలో గ్లూటామిక్ యాసిడ్, మాంగనీస్, లైకోపీన్, లైసిన్, అర్జినిన్ ఉంటాయి. ఇవి పురుషుల లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల పురుషులలో సంతానోత్పత్తి పెరగడమే కాకుండా జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పుచ్చకాయ గింజలను నేరుగా తినవచ్చు లేదంటే రాత్రిపూట మొలకెత్తడానికి వదిలివేసి ఎండలో ఎండబెట్టిన తర్వాత తినవచ్చు. గింజలను రుచిగా చేయాలనుకుంటే వాటిని వేయించి కూడా తినవచ్చు.

Tags:    

Similar News