Mental Health: మానసిక ప్రశాంతత కోసం ఇవి పాటించండి.. టెన్షన్ నుంచి బయటపడుతారు..!
Mental Health: ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటారు కానీ మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోరు.
Mental Health: ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటారు కానీ మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోరు. దీనివల్ల చిన్న విషయానికి కూడా ప్రతిసారి టెన్షన్‌కు గురవుతారు. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మంచి దినచర్యను పాటించాలి. దీనివల్ల శారీరకంగా, మానసికంగా దృడంగా తయారవుతాం. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇందుకోసం ఎలాంటి అలవాట్లు పాటించాలో ఈ రోజు తెలుసుకుందాం.
తగినంత నిద్ర
మంచి నిద్ర మనసుకు చాలా విశ్రాంతినిస్తుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం సరైన సమయంలో నిద్రపోవడం సరైన సమయంలో మేల్కొనడం మానసిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కాబట్టి నిర్ణీత సమయంలో నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోవాలి. 6 నుంచి 8 గంటల పాటు నిరంతరాయంగా నిద్రపోయేలా చూసుకోవాలి. మీ మనసు ఎంత రిలాక్స్‌గా ఉంటే అంత మెరుగ్గా పని చేస్తుంది. ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది. దీనివల్ల మీరు బాగా పని చేస్తారు.
రోజూ వ్యాయామం
రోజువారీ వ్యాయామాలు మిమ్మల్ని మానసికంగా దృఢంగా ఉంచుతాయి. రోజూ 15 నుంచి 30 నిమిషాల పాటు నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వ్యాయామం చేసినప్పుడు శరీరంలో హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మిమ్మల్ని ప్రశాంతంగా ఆరోగ్యంగా చేస్తాయి.
సమతుల్య ఆహారం
ప్రశాంతమైన మనస్సు కోసం ఆరోగ్యకరమైన ఆహారం అవసరమని వైద్యులు చెబుతున్నారు. మంచి ఆహారం మనస్సుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని గ్రంథాలలో పేర్కొన్నారు. అందువల్ల ప్రతిరోజు శాఖాహారం తినడం అలవాటు చేసుకోవాలి. తద్వారా మనస్సు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉంటుంది.
డ్రగ్స్ కు దూరం
వైద్యుల ప్రకారం ఏ రకమైన డ్రగ్స్ అలవాటు అయినా మానసిక ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి మనం అలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.
సామాజిక సంబంధాలు
మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో మీరు ఎంత బాగా కనెక్ట్ అయి ఉంటే మీ మానసిక ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది. అందువల్ల నిత్యం ప్రజలతో మాట్లాడాలి. మీ అభిప్రాయాలను పంచుకోవాలి. దీనివల్ల మీ మనస్సు తేలికపడుతుంది. మీకు ప్రశాంతత లభిస్తుంది.