Aloe Vera: పట్టులాంటి జుట్టు కోసం అలోవెరా
Aloe Vera: కలబంద (ఆలోవెరా) అనేక జుట్టు సమస్యలతో సమర్థవంతంగా పోరాడుతుంది.
Aloe Vera: పట్టులాంటి జుట్టు, రసాయనాలు లేకుండా మెరిసే జుట్టు కావాలని ఎవరికి ఉండదు? అలాంటి హెయిర్ మీకూ కావాలని అనిపిస్తొందా? కాస్త శ్రద్ద పెట్టాలే గాని మెరిసే జుట్టు మీ సొంత చేసుకోవచ్చు. మీ జుట్టుకి ప్రతిరోజూ కాలుష్యం, స్టైలింగ్ టూల్స్, ఉత్పత్తుల వచ్చే సమస్యలను చూసి ఎన్నిసార్లు చిరాకు పడివుంటారు? లేదా జుట్టు ఆరోగ్యంగా లేదని ఎన్నిసార్లు బాధపడివుంటారు? అయితే మీ జుట్టు సమస్యలు మొత్తం తీరిపోతాయి. కలబంద మీ చెంత ఉంటే అందమైన కురులు మీ సొంతం అది ఎలానో మన 'లైఫ్ స్టైల్' లో చూద్దాం
కలబంద (ఆలోవెరా) అనేక జుట్టు సమస్యలతో సమర్థవంతంగా పోరాడుతుంది. దాదాపు అందరికీ అందుబాటులో నే వుంటుంది. ఆలోవెరాలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మాడుపై పాడైన కణాలను బాగుచేస్తాయి. ఇలా కుదుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, త్వరగా జుట్టుపెరిగేలా చేస్తుంది.ఆలోవెరాను జుట్టుకి రాయటం వలన జుట్టు వెంటనే మృదువుగా,మెత్తగా మారుతుంది. మృదువైన జుట్టుతో హెయిర్ స్టైలింగ్ సులభమౌతుంది. ఆలోవెరా వాపు వ్యతిరేక లక్షణాలు మీ తల మాడుకి మంట,వాపు నుంచి ఉపశమనం ఇస్తాయి. అంతే కాదు దీనిలోని ఫంగల్ వ్యతిరేక లక్షణం చుండ్రును,పొట్టుగా ఊడిపోవటాన్ని నివారిస్తుంది.
అలోవెరా ప్యాక్...
సమాన పరిమాణాల్లో కొబ్బరినూనె, ఆలోవెరాను కలపటం వలన అలోవెరా ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ తలపై నెమ్మదిగా మసాజ్ చేస్తూ చివర్ల వరకూ రాయండి. ముఖ్యంగా చివర్ల ఎక్కువగా రాయండి. ఎందుకంటే అక్కడే జుట్టు ఎక్కువగా పాడవుతుంది. సరిగ్గా తల అంతా పట్టించాక, షవర్ క్యాప్ పెట్టుకొని ఒక గంట అలా వదిలేశాక కడిగేయండి. ఈ అద్భుతమైన కండీషనింగ్ రెసిపి మీ జుట్టు ఆరోగ్యాన్ని తలపై తేమ పోకుండా చేసి కాపాడుతుంది. దీని వల్ల బలమైన,మృదువైన,ఒత్తైన జుట్టు వస్తుంది. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ను వేసుకుంటూ వుండాలి. ఇలా చేస్తూ వుంటే అందమైన పట్టులాంటి జుట్టు మీ సొంతం అవుతుంది.