Tomato Flu: తల్లిదండ్రులకి అలర్ట్.. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే టామటా ఫ్లూ..!
Tomato Flu: తల్లిదండ్రులకి అలర్ట్.. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే టామటా ఫ్లూ..!
Tomato Flu: దేశంలో కరోనా, మంకీపాక్స్ తర్వాత ఇప్పుడు టమోటా ఫ్లూ విస్తరిస్తోంది. తాజాగా కేంద్రం ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. దీని మొదటి కేసు మే 6న కేరళలోని కొల్లం జిల్లాలో కనుగొన్నారు. ఈ ఫ్లూ చిన్న పిల్లలను తన వశం చేసుకుంటోంది. ఒడిశా రాష్ట్రంలో 1 నుంచి 9 ఏళ్లలోపు 26 మంది చిన్నారులు ఈ ఫ్లూ బారిన పడ్డారు. ఈ పరిస్థితిలో టమోటా ఫ్లూ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
టమోటా ఫ్లూ లక్షణాలు
టొమాటో ఫ్లూ లక్షణాలు చికెన్ పాక్స్ లాగానే ఉంటాయి. చర్మంపై ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. పెద్ద పెద్ద దద్దుర్లు కూడా కనిపిస్తాయి. శరీరంపై ఎర్రటి బొబ్బలు ఉండటం వల్ల దీనికి టొమాటో ఫ్లూ అని పేరు పెట్టారు. ఈ దద్దుర్లు కొన్ని రోజుల తర్వాత వాటంతట అవే నయం అవుతాయి. ఇది ఒక అంటు వ్యాధి. ఇది పిల్లల నుంచి మరొక పిల్లవాడికి వ్యాపిస్తుంది. పాఠశాలకు వెళ్లే పిల్లల్లో వేగంగా విస్తరిస్తోంది. లక్షణాలు అలసట, వికారం, వాంతులు, అతిసారం, జ్వరం, డీ హైడ్రేషన్, కీళ్ల వాపు, శరీర నొప్పులు, సాధారణ ఇన్ఫ్లుఎంజా కనిపిస్తాయి.
నివారణ చర్యలు
ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు. కానీ నివారణ చాలా ముఖ్యం. లక్షణాలను సకాలంలో గుర్తించడం సోకిన వారిని వేరు చేయడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. పిల్లలు ఏదైనా నోటిలో పెట్టుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల టొమాటో ఫ్లూ సోకుతుంది. అందువల్ల పిల్లలు తమ బొమ్మలు, బట్టలు, ఆహారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని చెప్పాలి. ఈ ఫ్లూ రాకుండా ఉండాలంటే చుట్టూ పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. మీ పిల్లల గది వారి వస్తువులను శానిటైజ్ చేస్తూ ఉండాలి.