Diabetic Patients: మీకు షుగర్‌ ఉందా.. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Diabetic Patients: వర్షాకాలం చల్లగా ఉంటుంది కానీ రోగాల బెడద ఎక్కువగా ఉంటుంది.

Update: 2023-08-10 16:00 GMT

Diabetic Patients: మీకు షుగర్‌ ఉందా.. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Diabetic Patients: వర్షాకాలం చల్లగా ఉంటుంది కానీ రోగాల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్‌ ఉన్నవారు ఆహార విషయంలో అలర్ట్‌గా ఉండాలి. లేదంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో చాలా వ్యాధులకి గురికావాల్సి ఉంటుంది. బయటి ఆహారాలని పూర్తిగా నివారించాలి. ఇంట్లో వండినవి మాత్రమే తీసుకోవాలి. వర్షాకాలంలో షుగర్‌ పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

పాదాలు జాగ్రత్త

మధుమేహం ఉన్నవారు పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న కోత పడినా మానడం కష్టమవుతుంది. రక్తంలో అధిక చక్కెర కారణంగా రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా పాదాలలోని నరాలు దెబ్బతింటాయి.

కళ్లు జాగ్రత్త

వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇందులో కంటి ఇన్ఫెక్షన్‌లకు సంబంధించిన కేసులు ఎక్కువగా వస్తాయి. వీటిని నివారించడానికి చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కళ్ళను తరచుగా తాకకుండా ఉండాలి.

ఆరోగ్యకరమైన భోజనం

మధుమేహం ఉన్నప్పుడు ఏ సీజన్ లో అయినా కొన్ని నియమాలు పాటించాలి. కాలానికి తగ్గట్లుగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వర్షాకాలంలో ఇంట్లో శుభ్రంగా వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి.

డీ హైడ్రేషన్

వర్షాకాలంలో దాహం అంతగా వేయదు. కానీ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం అవసరం. తరచుగా మారే వాతావరణం, వేడి- తేమ పరిస్థితులు డీ హైడ్రేషన్‌కి కారణమవుతాయి. కాబట్టి షుగర్‌ పేషెంట్లు సరిపడా నీరు తాగాలి. కొద్దిగా కొబ్బరి నీళ్లను కూడా తాగవచ్చు.

వ్యాయామం

వర్షాకాలంలో చురుకుదనం లోపిస్తుంది. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఈ అలవాటు అనారోగ్యానికి దారితీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తగినంత విశ్రాంతి తీసుకుంటూనే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇంట్లోనే ఉంటూ డయాబెటీస్‌ను నియంత్రించే వ్యాయామాలు చేయవచ్చు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూసుకోవచ్చు. 

Tags:    

Similar News