Health Tips: శ్వాసకోశ రోగులకి అలర్ట్.. వాతావరణం మారుతోంది జాగ్రత్త..!
Health Tips: శ్వాసకోశ రోగులకి అలర్ట్.. వాతావరణం మారుతోంది జాగ్రత్త..!
Health Tips: వాతావరణం మారుతోంది. చలి పెరుగుతోంది. దీంతో శరీరంలో శ్వాసకోశ సమస్యలు మొదలయ్యాయి. కొంతమందికి దుమ్ము, పొగ లేదా మరేదైనా అలర్జీ ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కొనేందుకు సకాలంలో అవగాహన అవసరం. సమస్య మరింత పెరిగితే జీవితం భారంగా ఉంటుంది. ఈ రోజు సీజనల్ వ్యాధులైన శ్వాసకోశ వ్యాధుల గురించి తెలుసుకుందాం.
బ్రోన్కైటిస్
బ్రోన్కైటిస్ అనేది శ్వాస మార్గము వాపు. శ్వాసనాళం నుంచి ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్లే గొట్టాలను బ్రోంకి అంటారు. కొన్నిసార్లు బ్రోంకి గోడలు ఎర్రబడుతాయి. దీని వల్ల బలహీనంగా మారి బెలూన్ లాగా మారుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ఆస్తమాతో సహా ఇతర శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయి.
ఆస్తమా
ఆస్తమా అంటే శ్వాసకోశంలో వాపు ఏర్పడుతుంది. ఒక నిర్దిష్ట అలెర్జీ కారణంగా ఈ మార్గం చిన్నదిగా మారుతుంది. దీంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది. శరీరానికి సరైన ఆక్సిజన్ అందించడానికి ఊపిరితిత్తులకు గాలి అవసరం. ఈ కారణంగా రోగి నోటి ద్వారా వేగంగా శ్వాసించడం ప్రారంభిస్తాడు. ఒకసారి ఈ వ్యాధి వస్తే పూర్తిగా నయం చేయడం కష్టం. సకాలంలో శ్రద్ధ తీసుకుంటే దీనిని చాలా వరకు నియంత్రించవచ్చు.
న్యుమోనియా
ఇది కూడా ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇందులో ఊపిరితిత్తులలో నీరు లేదా ఇతర ద్రవాలు నిండుతాయి. రోగి ముక్కు నుంచి నీరు కారుతూనే ఉంటుంది. శ్వాసకోశంలో తీవ్రమైన వాపు ఏర్పడుతుంది. ఈ వ్యాధిలో ఊపిరితిత్తుల పని సామర్థ్యం బాగా ప్రభావితమవుతుంది. న్యుమోనియా వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ వంటి ఇతర కారణాల వల్ల సంభవిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే వ్యక్తి చనిపోవచ్చు.