30 ఏళ్లు దాటిన పురుషులకి అలర్ట్‌.. వెన్నెముక బలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..!

Men Health: శరీరంలో ఎముకలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది.

Update: 2022-11-02 14:30 GMT

30 ఏళ్లు దాటిన పురుషులకి అలర్ట్‌.. వెన్నెముక బలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..!

Men Health: శరీరంలో ఎముకలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇవి మన శరీర నిర్మాణానికి సహాయపడుతాయి. ఎముకలు బలహీనమైతే శరీరంలో నొప్పి మొదలవుతుంది. వెన్నెముక శరీరానికి చాలా ముఖ్యమైనది. కానీ 30 సంవత్సరాల తర్వాత అది కొద్ కొద్దిగా బలహీనంగా మారుతుంది. ఈ సమస్యను నివారించడానికి మీరు వెన్నెముకకు మేలు చేసే ఆహార పదార్థాలను తినాలి. వాటి గురించి తెలుసుకుందాం.

వెన్నెముక బలహీనంగా మారినప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, తుంటి నొప్పి, నడకలో ఇబ్బంది వంటి సమస్యలు ఏర్పడుతాయి. చాలా సందర్భాలలో చేతులు, కాళ్ళు తిమ్మిరికి గురవుతాయి. మీరు 30 సంవత్సరాలు దాటిన వారైతే వెన్నెముకను బలోపేతం చేయడానికి మొక్కల ఆధారిత ప్రోటీన్ తీసుకోవడం అవసరం. మాంసాహారం తినడం వల్ల ప్రొటీన్ల అవసరం తీరుతుందేమో కానీ ఊబకాయం, కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయం కూడా ఉంటుంది.

1. పాల ఉత్పత్తులు

పాలు, దాని నుంచి తయారైన ఉత్పత్తులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకల పటిష్టతకు సహాయపడుతాయి. దీని కోసం మీరు పాలు, పెరుగు, జున్ను తినవచ్చు. అయితే తక్కువ కొవ్వు ఉన్న పాలు తాగండి లేదంటే అధిక బరువు పెరుగుతారు.

2. మూలికల వినియోగం

30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మూలికల వినియోగాన్ని పెంచాలి. ఎందుకంటే వీటిలో ఆయుర్వేద లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలకు బలానికి సహాయపడుతాయి. మీరు రోజువారీ ఆహారంలో అల్లం, పసుపు, దాల్చినచెక్క, తులసిని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే రోజుకు రెండుసార్లు హెర్బల్ టీని తాగాలి.

3. గ్రీన్ వెజిటేబుల్స్

గ్రీన్ వెజిటేబుల్స్ ని సూపర్ ఫుడ్స్ అంటారు. ఎందుకంటే వాటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బ్రొకోలీ, బచ్చలికూరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే వెన్నునొప్పి సమస్య ఉండదు.

Tags:    

Similar News