పురుషులకి అలర్ట్‌.. ఎక్కువగా జంక్‌ఫుడ్‌ తింటే అంతే సంగతులు..!

Men Health: జంక్ ఫుడ్ మన శరీరాన్ని చాలా రకాలుగా దెబ్బతీస్తుంది.

Update: 2023-01-22 14:30 GMT

పురుషులకి అలర్ట్‌.. ఎక్కువగా జంక్‌ఫుడ్‌ తింటే అంతే సంగతులు..!

Men Health: జంక్ ఫుడ్ మన శరీరాన్ని చాలా రకాలుగా దెబ్బతీస్తుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే పిజ్జా, బర్గర్,చిప్స్ చాలా ఇష్టంతో తింటారు. జంక్ ఫుడ్ ని నిరంతరం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇటీవల జంక్ ఫుడ్‌పై పరిశోధనలో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. యువత ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఇటీవల వెల్లడైన పరిశోధన ప్రకారం అధిక మొత్తంలో బర్గర్లు, పిజ్జా, హై ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల యువకులు ఫిట్‌గా ఉంటారు కానీ వారి స్పెర్మ్ కౌంట్ తగ్గుతోంది. పరిశోధన ప్రకారం అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ పురుషుల వృషణాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అమెరికన్, డానిష్ పరిశోధకుల బృందం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధన చేసింది. ఇందులో జంక్‌ ఫుడ్‌ తినే వ్యక్తుల సగటు స్పెర్మ్ కౌంట్ క్షీణించినట్లు కనుగొన్నారు.

పరిశోధనలో 3 వేల మంది యువకులు

హార్వర్డ్‌లో జరిగిన ఈ పరిశోధనలో దాదాపు 3 వేల మంది పురుషులు పాల్గొన్నారు. ఈ వ్యక్తుల సగటు వయస్సు 19 సంవత్సరాలు. విశేషమేమిటంటే వీరు ఆర్మీ ఫోర్స్‌లో చేరడానికి ముందు సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డైట్ సర్వే ఆధారంగా పురుషులపై ఈ పరిశోధన జరిగింది. చేపలు, మాంసం, పిజ్జా, బర్గర్‌ లాంటి ఆహారాలు తిన్న యువకులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్లు తేల్చారు. తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్న పురుషుల ఆహారంలో ఇన్హిబిన్-బి అనే రసాయనం తక్కువగా ఉంటుంది. ఇది స్పెర్మ్-ఉత్పత్తి చేసే సెర్టోలీ కణాలను దెబ్బతీస్తుంది.

Tags:    

Similar News