Men Health: 40 ఏళ్లు దాటిన పురుషులకి అలర్ట్‌.. ఈ అలవాట్లని మానుకోండి లేదంటే చాలా ప్రమాదం..!

Men Health: ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు ప్రజలలో విపరీతంగా పెరుగుతున్నాయి.

Update: 2022-12-22 15:30 GMT

Men Health: 40 ఏళ్లు దాటిన పురుషులకి అలర్ట్‌.. ఈ అలవాట్లని మానుకోండి లేదంటే చాలా ప్రమాదం..!

Men Health: ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు ప్రజలలో విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో అనేక కేసులు తెరపైకి వస్తున్నాయి. మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. చెడు అలవాట్ల కారణంగా ప్రజలు గుండె సంబంధిత సమస్యలకి బలైపోతున్నారు. వ్యాయామం చేయకపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిలో మీరు గుండె సంబంధిత వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండాలంటే కొన్ని అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

ధూమపానానికి దూరం

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ధూమపానానికి దూరంగా ఉండాలి. సిగరెట్‌లో శరీరానికి చాలా హానికరమైన పొగాకు ఉంటుంది. దీనివల్ల ఊపిరితిత్తులకు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సిగరెట్ అలవాటును ఈరోజే వదిలేయండి.

వ్యాయామం

ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. రోజూ కనీసం 30 నిమిషాల యాక్టివిటీ చేయడం అవసరం. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది. అంతే కాదు వ్యాయామం చేయడం వల్ల హై బీపీ, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవు.

తగినంత నిద్ర

ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర అవసరం. దీని కోసం రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి. బాగా నిద్రపోవడం వల్ల హై బీపీ, డయాబెటిస్, డిప్రెషన్, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

ఒత్తిడి

ఒత్తిడిని తగ్గించుకోవడానికి అనారోగ్యకరమైన ఆహారం, మద్యపానం, ధూమపానం మానేయాలి. అంతేకాకుండా యోగా, ధ్యానాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి.

Tags:    

Similar News