Men Health: 30 ఏళ్లు దాటిన మగవారికి అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదం ముంచుకొస్తున్నట్లే..!
Men Health: ఈ రోజుల్లో పురుషులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
Men Health: ఈ రోజుల్లో పురుషులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కుటుంబ బాధ్యతలని మోస్తూ వారి గురించి పట్టించుకోవడం లేదు. అందుకే చిన్న వయసులోనే అనేక తీవ్రమైన వ్యాధులకి గురవుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటితే రోగాలు వచ్చేవి కానీ నేటి కాలంలో 30 ఏళ్లు దాటితే చాలు అన్నివ్యాధుల ప్రమాదం పెరిగింది. అయితే ఈ వ్యాధుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం.
గుండె జబ్బులు
ఈ రోజుల్లో పురుషులలో అతిపెద్ద ప్రమాదం గుండె జబ్బులు. చిన్న వయసులోనే గుండెపోటు రావడంతో చాలామంది చనిపోతున్నారు. అలాగే హైబీపీ సమస్య సర్వసాధారణమైపోతోంది. దీని వల్ల గుండె జబ్బులు ప్రమాదం పెరుగుతోంది. ఈ పరిస్థితిలో గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. ఇందుకోసం రోజూ ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి.
మధుమేహం
ప్రస్తుతం మధుమేహం అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి. భారతదేశంలో ఈ రోగుల సంఖ్య 100 మిలియన్లు దాటింది. సరైన జీవనశైలి, జన్యుపరమైన కారణాల వల్ల కూడా మధుమేహం సంభవిస్తుంది. ఈ రోజుల్లో 30 సంవత్సరాల వయస్సు తర్వాత పురుషులలో దీని కేసులు పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ఈ పరిస్థితిలో వృద్ధాప్యంలో పురుషులు చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం అవసరం. ఇందుకోసం మంచి ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా రోజూ వ్యాయామం చేయాలి.
ఆందోళన
ఇతర వ్యాధుల మాదిరిగానే ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. పని ఒత్తిడి లేదా వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య వల్ల దీని బారినపడుతున్నారు. ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఈ వ్యాధులు శరీరానికి చాలా ప్రమాదకరమైనవి. ఈ పరిస్థితిలో పురుషులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా మానసిక సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం అవసరం.