Diabetic Patients: మధుమేహ రోగులకి అలర్ట్.. వీటిని డైట్‌లో చేర్చుకొని అధిక చక్కెరని నివారించండి..!
Diabetic Patients: ప్రపంచంలో రోజు రోజుకి మధుమేహ రోగులు పెరిగిపోతున్నారు. ఇది ఒక జీవనశైలికి సంబంధించిన ఆరోగ్య సమస్య.
Diabetic Patients: ప్రపంచంలో రోజు రోజుకి మధుమేహ రోగులు పెరిగిపోతున్నారు. ఇది ఒక జీవనశైలికి సంబంధించిన ఆరోగ్య సమస్య. ఇండియాలో ఈ వ్యాధి సాధారణంగా మారిపోయింది. కొన్నిసార్లు ఈ వ్యాధి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోతాయి. ఎందుకంటే ఇది చాలాసార్లు ప్రమాదకరమైనదిగా తేలింది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల అనేక రకాల సమస్యలు, వ్యాధులు ఎదురవుతాయి. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలని డైట్‌లో చేర్చుకుంటే ఇది సాధ్యమే. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
దాల్చిన చెక్క
దాల్చినచెక్కలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని లిపిడ్ల స్థాయిని తగ్గిస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. మధుమేహం రోగులలో బాడీ మాస్ ఇండెక్స్‌ను తగ్గించడానికి దాల్చినచెక్కను ఉపయోగిస్తారు. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
తృణధాన్యాలు
తృణధాన్యాలలో కరిగే ఫైబర్ ఉంటుంది. వోట్స్, గోధుమలు మొదలైన తృణధాన్యాలు ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటని ఉడికించడం చాలా సులభం ప్రతిరోజూ తినవచ్చు.
గుడ్లు
గుడ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్ లభిస్తుంది. ఇది మధుమేహ రోగులకి చాలా ముఖ్యం. అందుకే షుగర్ పేషెంట్లు రోజుకి ఒక ఉడకబెట్టిన గుడ్డు తినవచ్చు.
జామ
మధుమేహ రోగులకి జామకాయలు దివ్యౌషధమని చెప్పవచ్చు. ఇందులో తక్కువ గ్లెసమిక్ ఇండెక్స్ స్థాయిలు ఉంటాయి. ఇందులోని సహజ చక్కెర షుగర్ పేషెంట్లకి ఎటువంటి హాని చేయదు. అందుకే ప్రతిరోజు ఒక జామకాయ తినవచ్చు.
నేరేడు పండ్లు
నేరేడు పండ్లు మధుమేహ రోగులకి చాలా మంచివి. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తాయి. డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. వీటి ఆకులలో కూడా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఇవి అధిక చక్కెరని తగ్గిస్తాయి.