Health Tips: షుగర్ పేషెంట్లకి అలర్ట్.. ఈ గింజలు తింటే చక్కెర కంట్రోల్..!
Health Tips: శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల మధుమేహం ఏర్పడుతుంది.
Health Tips: శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల మధుమేహం ఏర్పడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేనప్పుడు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఆహార పదార్థాలలో ఉండే చక్కెర, కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. అయితే ఆహారం ద్వారా కూడా చక్కెరను నియంత్రించవచ్చు. డైట్‌లో కొన్ని గింజలను చేర్చుకోవడం వల్ల షుగర్ పెరగకుండా నిరోధించవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడానికి ఏ గింజలు ఉపయోగపడతాయో ఈ రోజు తెలుసుకుందాం.
పిస్తాపప్పు
పిస్తాపప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. పిస్తా తింటే మధుమేహం పెరగకుండా కాపాడుకోవచ్చు.
బాదం
బాదం పోషకాల భాండాగారం. బాదంపప్పు తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. వీటిలో ఫైబర్, విటమిన్-ఈ, విటమిన్-బి12, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. బాదం గ్లూకోజ్ స్థాయిని సాధారణీకరించడంలో సహాయపడుతుంది.
వేరుశనగ
వేరుశనగను పేదల బాదం అంటారు. ఇందులో ఉండే ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కొవ్వు పదార్థాలు చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. వేరుశెనగలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా వేరుశెనగ తినడం మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
వాల్నట్
వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. మీరు షుగర్‌ను నియంత్రించాలనుకుంటే వాల్‌నట్‌లను ఆహారంలో భాగం చేసుకోండి.
జీడిపప్పు
జీడిపప్పులో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల షుగర్, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. నానబెట్టిన జీడిపప్పు తినడం మధుమేహంలో ప్రయోజనకరంగా ఉంటుంది.