Sperm Count: పిల్లలు పుట్టాలంటే స్పెర్మ్‌ కౌంట్ ఎంతుండాలో తెలుసా.?

శుక్రకణాల నాణ్యతతో పాటు కౌంట్ తగ్గడం వల్ల సంతానలేమీ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-08-23 14:30 GMT

Sperm Count: పిల్లలు పుట్టాలంటే స్పెర్మ్‌ కౌంట్ ఎంతుండాలో తెలుసా.?

Sperm Count: ఒకప్పుడు సంతానలేమి సమస్యలు పురుషుల్లో ఉంటాయని కూడా భావించే వారు. కానీ ప్రస్తుతం పురుషుల్లో కూడా సంతానలేమి సమస్యలు ఎక్కువుతున్నాయి. ఎన్నో గణంకాలు ఇది నిజమని చెబుతున్నాయి. ముఖ్యంగా మారిన జీవిన విధానం కారణంగా చాలా మంది పురుషుల్లో ఈ సమస్య వస్తుంది. నిద్రలేమి, శారీరక వ్యాయామం తగ్గడం, వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పనిచేయడం ఇలా రకరకాల అంశాలు దీనికి కారణాలవుతున్నాయి.

శుక్రకణాల నాణ్యతతో పాటు కౌంట్ తగ్గడం వల్ల సంతానలేమీ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక పురుషుడికి సంతానలేమి సమస్య ఉండొద్దంటే శుక్ర కణాల సంఖ్య ఎంత ఉండాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటన చేసింది. ఒక ml వీర్యంలో 1.5 కోట్ల శుక్ర కణాలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సంఖ్య తగ్గితే తండ్రి కావడంలో ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. అలాగే స్పెర్మ్‌ నాణ్యత కూడా బాగుండాలని అంటున్నారు. శుక్ర కణాల కదలికలు బాగుంటేనే గర్భం దాల్చే అవకాశాల ఉంటాయని అంటున్నారు. 40 శాతం శుక్ర కణాలు అండాన్ని చేరుకుంటనే, గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి.

ఇంతకీ స్పెర్మ్‌ కౌంట్ తగ్గడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్మోకింగ్, మద్యం సేవించే వారిలో స్పెర్మ్‌ కౌంట్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం కూడా స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి ఒక కారణమని అంటున్నారు. పురుషుల సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ అసమతుల్యత కారణంగా కూడా స్మెర్మ్‌ కౌంట్ తగ్గుతుంది. ప్రైవేట్ భాగాలలో ఇన్‌ఫెక్షన్, పలు రకాల లైంగిక వ్యాధుల కారణంగా కూడా స్పెర్మ్‌ కౌంట్ తగ్గుతుంది.

శుక్రకణాల సంఖ్యతో పాటు, నాణ్యత పెరగాలంటే స్మోకింగ్‌ను పూర్తిగా మానేయాలి. అలాగే వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పనిచేయకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని ఉపయోగించకూడదు, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ఒత్తిడిని కూడా దూరం చేసుకునేలా యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఇంటర్నెట్‌తో పాటు ఇతర మాధ్యమాల్లో లభించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు అందించాము. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News