Lifestyle: బీపీకి అసలు కారణమేంటి.? ICMR ఏం చేయాలని చెబుతోందంటే..!

Hypertension: రక్తపోటు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న అంశాల్లో ఒకటి. మరీ ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఈ సమస్యబారిన పడుతున్నారు.

Update: 2024-06-11 07:00 GMT

Lifestyle: బీపీకి అసలు కారణమేంటి.? ICMR ఏం చేయాలని చెబుతోందంటే..!

Hypertension: రక్తపోటు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న అంశాల్లో ఒకటి. మరీ ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఈ సమస్యబారిన పడుతున్నారు. భారత్‌లో సుమారు 20 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. అయితే వీరిలో కేవలం కోటి మందికి మాత్రమే రక్తపోటు అదుపులో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకీ బీపీ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరగడంపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్ రీసెర్చ్‌ ఓ నివేదిక విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో అధికరక్తోపాటు తీవ్రమవుతోన్న సమస్య. అధిక రక్తపోటు ప్రారంభ దశల్లో నిర్దిష్ట లక్షణాలు కనిపించవని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనిని సైలెంట్‌ కిల్లర్‌గా పిలుస్తుంటారు. రక్తపోటు అధికమైతే గుండె జబ్బులు, స్ట్రోక్‌, మూత్ర పిండాలు దెబ్బతినడం, కంటి చూపు కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.

కారణాలు ఇవే..

బీపీ పెరగడానికి సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్‌ తీసుకోవడం కారణాలుగా చెబుతున్నారు. ఇక ఊబకాయంతో బాధపడేవారికి బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కుటుంబంలో ఎవరికైనా అధిక రక్తపోటు లేదా గుండె జబ్బులు వంటి సమస్యలు ఉంటే మిగతా వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఇక ఒత్తిడి కూడా అధిక రక్తపోటుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

ఎలా నియంత్రించాలి..

బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి జీవనవిధానంలో మార్పులతో పాటు, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డైట్‌లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే కొవ్వు తీసుకోవడం తగ్గించాలి. వీటితో పాటు వారానికి కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అధిక బరువు ఉంటే తగ్గడానికి ప్రయత్నించాలి. స్మోకింగ్‌, ఆల్కహాల్‌ పూర్తిగా తగ్గించాలి. ఒత్తిడిని జయించడానికి యోగా, మెడిటేషన్‌ వంటివి అలవాటు చేసుకోవాలి. క్రమంతప్పకుండా బీపీ చెకప్‌ చేసుకుంటూ.. వైద్యుల సూచనలు పాటించాలి.

Tags:    

Similar News