Chicken: చికెన్‌లో ఈ పార్ట్ తింటున్నారా.? ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటా..

ప్రోటీన్‌లకు పెట్టింది పేరైన చికెన్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు ఉంటాయి. అందుకే వారంలో ఒక్కసారైనా చికెన్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-08-24 05:27 GMT

Chicken: చికెన్‌లో ఈ పార్ట్ తింటున్నారా.? ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటా..

Chicken: చికెన్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిందే. ప్రోటీన్‌లకు పెట్టింది పేరైన చికెన్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు ఉంటాయి. అందుకే వారంలో ఒక్కసారైనా చికెన్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే చికెన్‌లో కొన్నింటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మంది చికెన్‌ను స్కిన్‌తో తినడానికి ఇష్టపడుతుంటారు. నిజానికి స్కిన్‌ కూరకు రుచిని కూడా తీసుకొస్తుంది.

అయితే చికెన్‌ స్కిన్‌తో తినడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. స్కిన్‌లో కొవ్వు అధికంగా ఉండడమే దీనికి కారణమని అంటున్నారు. స్కిన్‌లోని కొవ్వు గుండెకు ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే కొందరు చికెన్‌ షాపు యజమానులు చికెన్‌ నిత్యం ఫ్రెష్‌గా కనిపించాలనే ఉద్దేశంతో చర్మానికి రకరకాల రసాయనాలు పూస్తుంటారు. దీనివల్ల కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ఆ రసాయనాలు శరీరంలోకి చేరడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.

మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు, గుండె జబ్బుల నుంచి కోలుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో చికెన్‌ను స్కిన్‌తో తినకూడదని చెబుతున్నారు. చికెన్ స్కిన్‌లో అసంతృప్త కొవ్వులు, కేలరీలు ఎక్కువగా ఉంటాయని, అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది ప్రమాదకరమని సూచిస్తున్నారు. అందుకే స్కిన్‌ను వీలైనంత వరకు అవయిడ్ చేయడమే ఉత్తమమని అంటున్నారు. మరి చికెన్‌లో ఆరోగ్యానికి మేలు చేసే పార్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్‌ చెస్ట్‌ పార్ట్‌లో కొవ్వు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కండరాల పుష్టిలో ఈ పార్ట్ దోహదపడుతుంది అలాగే చికెన్‌ లెగ్ పీస్‌ను వీలైనంత వరకు తగ్గించి తీసుకోవాలి. లెగ్ పీస్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. 

Tags:    

Similar News