Belly Fat: ఒక్క మసాలా దినుసుతో బెల్లీఫ్యాట్‌కి చెక్..!
Belly Fat: ఈ రోజుల్లో జీవనశైలి సరిగా లేక చాలామంది ఊబకాయులుగా మారిపోతున్నారు.
Belly Fat: ఈ రోజుల్లో జీవనశైలి సరిగా లేక చాలామంది ఊబకాయులుగా మారిపోతున్నారు. శరీర బరువు పెరగడం వల్ల జిమ్‌కి వెళ్లడం నుంచి జాగింగ్ వరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఊబకాయం తగ్గడం లేదు. మీరు కూడా ఊబకాయం సమస్యతో పోరాడుతున్నట్లయితే ఒక్క మసాలా దినుసు గురించి తెలుసుకోండి. ఇది బెల్లీఫ్యాట్‌ని కరిగించడమే కాకుండా శారీరకంగా ఫిట్‌గా మార్చుతుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ మసాలా పేరు దాల్చిన చెక్క. ఇది ప్రతి ఒక్కరి వంటగదిలో సులభంగా దొరుకుతుంది. మీరు రోజు తాగే టీలో దాల్చిన చెక్క పొడి, తులసి ఆకులు, అల్లం మిక్స్ చేసి తాగాలి. ఈ స్ట్రాంగ్ టీ తాగడం వల్ల మీ పొట్టలో ఉన్న కొవ్వు కనిపించకుండా పోతుంది. మీ ఫిట్‌నెస్ మెరుగుపడుతుంది.
మీకు జలుబు, జ్వరం లేదా తలనొప్పి సమస్య ఉంటే దాల్చిన చెక్కను ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి. దీనివల్ల మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి మీకు రక్షణ ఉంటుంది. అయితే దాల్చినచెక్క గుణం వేడిగా ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీని వారానికి ఒకసారి మాత్రమే ప్రయత్నించాలి.
పెరుగుతున్న శరీర బరువును నియంత్రించాలంటే దాల్చిన చెక్కను నీళ్లతో మరిగించి తాగాలి. ఆ నీటిని తాగే ముందు అందులో నిమ్మరసం, కొంచెం తేనె కలపాలి. ఇది దాని ప్రభావాన్ని రెట్టింపు చేస్తుంది. దీని కారణంగా మీ కొవ్వు నెమ్మదిగా కరగడం ప్రారంభమవుతుంది. మీ శరీరం మంచి ఆకృతికి వస్తుంది.