Crying Benefits: ఏడిస్తే బరువు తగ్గుతారట..కొత్త అధ్యయనం చెబుతోంది
Crying Benefits: నేటికాలంలో చాలా మంది అధిక బరువు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గకపోవడంతో విసిగిపోతున్నారు. మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఏడిస్తే చాలు. అవును మీరు చదివింది నిజమే. ఏడుస్తే బరువు తగ్గుతారని కొత్త అధ్యయనం చెబుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందామా మరి.
Crying Benefits : చాలా మంది ఏడిస్తే..ఏదో సమస్యను ఎదుర్కొంటున్నారని భావిస్తారు. భరించేలేని బాధ కలిగినప్పుడే కంటి నుంచి నీరు కారుతుంది. కొంతమందికి సంతోషంలో కూడా కన్నీళ్లు వస్తుంటాయి. అయితే ఏడ్వడం వల్ల శరీరానికి మంచి జరుగుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. ఒత్తిడి తగ్గడమే కాదు ఏడ్వడం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఏడుపు అనేది కేలరీలను బర్న్ చేస్తుందట. రోజూ కాసేపు ఏడిస్తే కేలరీలు తగ్గుతాయని చెబుతున్నారు. ఎంత సేపు ఏడుస్తే ఎన్ని కేలరీలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంతసేపు ఏడ్వాలి:
హార్వర్డ్ మెడికల్ స్కూల్ వారు ప్రచురించిన జర్నల్ లో కేలరీలు బర్న్ కావాలంటే కాసేపు స్విమ్మింగ్ చేస్తే చాలని పేర్కొన్నారు. ఏడ్వడమే కాదు నవ్వడం వల్ల కూడా కేలరీలు బర్న్ అవుతాయని తెలిపారు. ఏడ్చినప్పుడు చాలా కేలరీలు ఖర్చు అవుతాయట. ఒక నిమిషం నవ్వితే దాదాపు 1.3 కేలరీలు బర్న్ అవుతాయి. ఏడ్చినప్పుడు కూడా అంతే ఖర్చు అవుతాయి. 10 నిమిషాల పాటు ఏడిస్తే 10 నుంచి 13కేలరీలు ఖర్చు అవుతాయి. దానికోసం ఏడ్వాల్సిన అవసరం లేదని..భావోద్వేగా ప్రభావం కారణంగా ఏడుపును కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
-ఆటలు ఆడడం
-పుష్కలంగా నీరు త్రాగడం
-తగినంత నిద్రపోవడం
-ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం
-చక్కెర, కొవ్వు పదార్థాలు తగ్గించడం
-ఏడ్చిన తర్వాత మనసుని కాస్తా మెరుగ్గా ఉంటుంది.
-మీరు పడుకున్నప్పుడు మీరు త్వరగా నిద్రపోతారు.
-మీ శరీరంలో కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడుతారు.
-మీ కంటి చూపు మెరుగుపడుతుంది.
-ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. తద్వారా మీ శరీరం విముక్తి పొందుతుంది.
-మీ శరీరం మరింత శక్తివంతంగా మారతుంది.
-ప్రశాంతంగా ఉంటుంది.