Dandruff Control Tips: ఇంటి చిట్కాలతో చుండ్రు కు చెక్ పెట్టండిలా

Dandruff Control Tips: చుండ్రు అనేది ప్రాణాంతక వ్యాధి కాదు, కాని చాలా చిరాకు కలిగించే సమస్య.

Update: 2021-03-02 07:18 GMT

ఫైల్ ఇమేజ్


Dandruff Control Tips: చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యలలో చుండ్రు సమస్య ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీని వలన ఇబ్బంది పడుతుంటారు. ఉరుకులు, పురుగుల జీవితంలో తల, వెంట్రుకలపై సరిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. తలస్నానం చేయాలనుకుంటే అందుబాటులో వుండే షాంపూలను వాడేస్తున్నాం. దీంతో తలపై ఉండే చర్మం, వెంట్రుకలు అనేక రుగ్మతలకు లోనవుతుంది. అందులో ఒకటి చుండ్రు. చుండ్రు అనేది ప్రాణాంతక వ్యాధి కాదు, కాని చాలా చిరాకు కలిగించే సమస్య. కొందరిలో ఈ సమస్య వారి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తుంది. తలలో ఉండే చుండ్రు మొహం మీద, భుజాల మీద రాలి చాలా చిరాకుగా ఉంటుంది. ఒక్కోసారి ఈ చుండ్రు వల్ల మొహం మీద పొక్కులు వచ్చి అందవిహీనంగా తయారయి ఆత్మవిశ్వాసం కోల్పోతారు, బయటకి రారు. కొంతమందిలో మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ చుండ్రు సమస్య తీవ్రం అవుతుంది. దీంతో చాలా మంది డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతూ వుంటారు. పూర్తిగా చుండ్రుని తగ్గించటం అన్నిసార్లు సాధ్యం కాదు, కాకపొతే మళ్ళీ మళ్ళీ రాకుండా మన ఇంట్లో వుండే కొన్ని వస్తువులతో ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటే మన హెచ్ ఎం టివి "లైఫ్ స్టైల్" లో చూద్దాం...

ఈస్టు (yeast) సూక్ష్మజీవి కారణం...

అస్సలు చుండ్రు చుండ్రు రావటానికి కారణం మన తలలో ఉండే ఈస్టు (yeast) సూక్ష్మజీవి. దీని వల్ల ఎలాంటి హానీ వుండదు. తలలో అధికంగా ఉండే నూనె, మృతచర్మ కణాలను ఆహారంగా తీసుకుని ఈస్టు వృద్ధి చెంది చుండ్రుకి దారి తీస్తుంది. కొంతమంది బాగా వేడిగా ఉండే ప్రాంతం నుండి చలి ప్రదేశాలకి వచ్చినప్పుడు చుండ్రు వస్తుంది.

Home Remedies for Dandruff Control:

  • క్రొవ్వు ఉండే ఆహార పదార్ధాలు, జంక్ ఫుడ్ లను ఎక్కువగా తీసుకోవడం వలన sebaceous గ్రంధి నూనేని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీని వలన చుండ్రు మరింత ఎక్కువ అవుతుంది. అందువలన క్రొవ్వు పదార్ధాలు తగ్గించి కూరగాయలు, B విటమిన్ మరియు జింక్ ఉండే పళ్ళు ఎక్కువగా తినాలి. చుండ్రు అదుపులో ఉంటుంది.
  • ఇతరుల దువ్వెనలను, బ్రెష్‌లను, తువ్వాళ్ళను,ఇతరుల దుప్పట్లను, తలగడలను వాడకూడదు. తమ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. వారానికి ఒకసారి పరిశుద్ధమైన కొబ్బరినూనెను కానీ, ఆలివ్‌ ఆయిల్‌ను కానీ వెచ్చ చేసి, తలకు పట్టించి, సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయలు, శీకాయపొడిని ఉపయోగించి, తలస్నానం చేయాలి.
  • పొగలు కక్కే వేడినీటిని కానీ, మరీ చన్నీటిని కానీ తల స్నానానికి ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే తలస్నానానికి ఉపయోగించాలి. తీక్షణమైన ఎండ కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.
  • పుదీనా రసం మాడుకి పట్టించి అరగంట తర్వాత తలని శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు.
  • జుట్టుకు కండిషనర్ మందార ఆకులు మరియు పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.
  • మెంతి ఆకును దంచి పేస్ట్ లా చేసి తలకు రాస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి.
  • తలలో చుండ్రు ఏర్పడితే తాజా వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటయిన తర్వాత తలస్నానం చేయాలి. ఆ విధంగా తలస్నానం చేస్తే వెంట్రుకల చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.
  • ఆరు చెంచాల నీళ్లకు రెండు చెంచాల వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కేవలం నాలుగు నెలల్లో మీ చుండ్రు సమస్య పరిష్కారం అవుతుంది.
  • పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
  • రెండు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని నీటి లో వేసి రాత్రి మొత్తం నానపెట్టి, ఉదయం ఆ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.
  • అలోవెరా జెల్ ని తలకి పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి.
  • తలస్నానం చేసే ముందు ఆ నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి వాటితో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది. ఇది ఒక్కసారి చేసి వదిలేయకుండా వారానికి ఒక్కసారి అయినా ఇలా చేస్తూ ఉంటే చుండ్రుని నియంత్రిచుకోవచ్చు.
  • నిమ్మరసం పెరుగు కలిపి తలకి పెట్టుకుని ఒక ౩౦ నిమిషాల తర్వాత తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
  • నిమ్మరసం మరియు వేడి కొబ్బరినూనె రెండు కలిపి తలకి రాసుకుని మర్దనా చేసి ఒక 10 నిమిషాల తర్వాత తలంటు స్నానం చెయ్యాలి.
  • ఒక అర కప్పు మెంతుల్ని రాత్రంతా పెరుగు లేదా మజ్జిగలో నానపెట్టాలి. ప్రొద్దున్నే వాటిని మెత్తగా రుబ్బి తలకి పెట్టించి ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి వేయాలి. ఇలా నెలలో కనీసం రెండు సార్లు ఇలా చేస్తూ వుంటే మంచి ఫలితం వుంుటంది.
  • పుల్లటి పెరుగు తలకి పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చెయ్యాలి. దీని వలన చుండ్రు సమస్య తగ్గి జుట్టు మృదువుగా ఉంటుంది.
  • క్రోడిగుడ్డు జుట్టుకి పెట్టుకోవటం వలన వెంట్రుకలు మృదువుగా అవుతాయి మరియు జుట్టుకి కావలసిన పోషణ దొరుకుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది. వారానికి ఒక్కసారి ఇలా చెయ్యటం మంచిది.
  • అందరికీ అందుబాటులో వుండే కలబంద గుజ్జుని తీసి తలకి పట్టించి ఒక 30 నిమిషాలు వదిలేయాలి. ఎదైనా షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఇలా చెయ్యటం వలన తలలో చుండ్రు, పొక్కులు ఏవైనా గాట్లు లాంటివి తగ్గుతాయి.
  • రెండు ముల్లంగి గడ్డల నుండి తీసిన రసం తలకి పట్టించి ఒక 20 నిముషాలు అయ్యాక తలస్నానం చెయ్యాలి. దీని వలన తలలో పేరుకుపోయిన జిడ్డు, నూనె, చుండ్రు కు కూడా చెక్ పెట్టవచ్చు.
  • వెల్లుల్లి, ఉల్లిపాయల రసాన్ని కూడా తలకి పట్టించి సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి.
  • ఘాడత కలిగిన షాంపూల వాడకం తగ్గించి. కుంకుడు కాయలు, సీకాకాయలను వాడటం మంచిది.
  • కలబంద గుజ్జు మరియు కొబ్బరినూనె సమంగా తీసుకుని బాగా మరిగించి నీరు మొత్తం ఆవిరి అయ్యాక దాన్ని ఒక సీసాలో పోయాలి. రోజు దీనితో మర్దన చేసుకోవాలి. ఇలా చెయ్యటం వలన చుండ్రు తగ్గుతుంది. చుండ్రు
  • సమస్య మరీ తీవ్రంగా ఉన్నవారు ఈ చిట్కాలు రెండు రోజులకి ఒకసారి పాటించాలి. సో ఇంకెందుకు ఇవన్నీ మన వంటింట్లో దొరికేవే పై వాటిని పాటించి చుండ్రును నివారణకు జాగ్రత్తలు తీసుకుందాం...
Tags:    

Similar News