UK High Court: విజయ్‌ మాల్యా దివాలాదారేనంటూ లండన్‌ హైకోర్టు ప్రకటన

* విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ కోర్టులో ఎదురుదెబ్బ * బకాయిలు చెల్లించే స్థితిలో మాల్యా లేరని అభిప్రాయపడ్డ కోర్టు

Update: 2021-07-27 04:46 GMT

విజయ్‌ మాల్యా (ఫైల్ ఫోటో)

UK High Court: వేలకోట్ల రుణాల ఎగవేత కేసులో వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాల్యా దివాలాదారేనంటూ లండన్‌ హైకోర్టు ప్రకటించింది. భారత్‌కు మాల్యా అప్పగింత కేసును విచారించిన లండన్‌ హైకోర్టు దివాలా ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిలు చెల్లించగల స్థితిలో మాల్యా ఉన్నారనేందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఉత్తర్వులపై అపీల్‌ దాఖలు చేసే అవకాశాన్ని తోసిపుచ్చింది లండన్‌ హైకోర్టు.

Tags:    

Similar News