విశాఖలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్‌లో త్రిసభ్య కమిటీ విచారణను ముమ్మరం చేశారు. పలు పత్రాలు పరిశీలించారు. రేపు మరోసారి కమిటీ హస్పటల్ సందర్శించి మరికొన్ని అంశాలు పరిశీలిస్తామని త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. విశాఖపట్నంలో వెలుగులోకివచ్చిన కిడ్నీ రాకెట్‌పై త్రిసభ్య కమిటీ సభ్యులు మూడోరోజు విచారణ కొనసాగించింది. శ్రద్ధ హస్పటల్‌లో మరోసారి వివరాలు సేకరించింది. అయితే ఇప్పటికే 30 ప్రశ్నలకు సంబంధించిన నియమావళిని శ్రద్ధ హస్పిటల్‌కు అందించారు.
శ్రద్ధ హస్పిటల్‌లో ఎన్ని కిడ్నీ ఆపరేషన్లు చేశారు. కే షీట్స్ సమర్పించాలని ఆదేశించినట్లు కమిటీ మెంబర్, డీఎం అండ్ హెచ్ఓ తిరుపతిరావు తెలిపారు. కేసును విచారిస్తున్న పోలీసులు అధికారులను కూడా కలిసి వీరికి అవసరమైన సమాచారాన్ని తీసుకోనున్నారు. త్రి సభ్య కమిటీ ఏం నివేదిక ఇవ్వబోతుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.