విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు
* టీడీఐ జంక్షన్ దగ్గర ఉద్యోగులు, ప్రజా సంఘాల నిరసన * మద్దతు తెలిపిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి * స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం దారుణం -విజయసాయిరెడ్డి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ టీడీఐ జంక్షన్ దగ్గర ఉద్యోగులు, ప్రజా సంఘాల నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు మద్దతు ప్రకటించారు ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రి అవంతి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం దారుణమని అన్నారు విజయసాయిరెడ్డి. కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిందేనన్న ఆయన స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయాలకు అతీతంగా పోరాడదామని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు విజయసాయిరెడ్డి.