భారత ఆర్థిక వ్యవస్థ అంచనాను అప్‌గ్రేడ్ చేసిన వరల్డ్ బ్యాంక్.. అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న..

World Bank: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది.

Update: 2022-12-06 14:45 GMT

భారత ఆర్థిక వ్యవస్థ అంచనాను అప్‌గ్రేడ్ చేసిన వరల్డ్ బ్యాంక్.. అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న..

World Bank: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. అంతేకాకుండా అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఇండియా ఒకటని కితాబునిచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థ అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచుతూ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 7.1శాతంగా ఉందని వివరించింది. US, యూరో ప్రాంతం, చైనా నుంచి వచ్చే స్పిల్ ఓవర్‌ల వల్ల భారత్ ప్రభావితమవుతుందని వెల్లడించింది. ద్రవ్యవిధానం కఠినతరం చేయడం, అధిక కమోడిటీ ధరల దేశ వృద్ధిని ప్రభావితం చేసే అంశాలని ప్రపంచ బ్యాంక్ తేల్చి చెప్పింది. ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని తక్కువ ప్రభావంతో కొనసాగించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.

Tags:    

Similar News