వాహ్ అనిపించే సరికొత్త వాట్సప్ ఫీచర్స్...

వాట్సప్ యాప్‌ను పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సందేశాలు పంపించాలన్నా, వీడియో కాల్ మాట్లాడాలన్నా, ముఖ్యమైన సమాచారం తెలుసుకోవాలన్నా ప్రస్తుతం వాడే ఇన్స్ టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్.

Update: 2020-04-11 10:58 GMT

వాట్సప్ యాప్‌ను పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సందేశాలు పంపించాలన్నా, వీడియో కాల్ మాట్లాడాలన్నా, ముఖ్యమైన సమాచారం తెలుసుకోవాలన్నా ప్రస్తుతం వాడే ఇన్స్ టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్.ఈ యాప్ ను ఒకరో ఇద్దరో వాడడం కాదు ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను వాడుతున్నారు. ఈ యాప్ కి రోజులు గడిచిన కొలది క్రేజ్ మరింతగా పెరిగిపోతుంది. దీంతో వాట్సప్ కంపెనీ యూజర్స్ ని మరింత ఆకర్షించడానికి సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తుంది.

ఇదే కోణంలో మరికొన్ని ఫీచర్స్ ని వాట్సప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. వాటిలో ముచ్చటగా మూడు ఫీచర్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. వాట్సప్‌లో అడ్వాన్స్ సెర్చ్, బ్యాకప్ పాస్‌వర్డ్ ప్రొటెక్షన్, ఆటో డౌన్‌లోడ్ రూల్స్ వాట్సప్‌కు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని ప్రపంచానికి ముందే చెప్పే WABetaInfo ప్రకారం త్వరలో రానున్నాయి. ఇక ఈ ఫీచర్స్ ఉపయోగాలేంటో, అవి ఏ విధంగాపని చేయనున్నాయో తెలుసుకుందాం.

Backup Password Protection

చాలా మంది తమ వాట్సప్ మేసేజులు కానీ, ఫోటోలు కానీ ప్రైవసీగా ఉంచడానికే ఇష్టపడుతుంటారు. అలాంటి వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ వలన ఛాట్ బ్యాకప్ సెట్టింగ్స్‌లో కనిపించనుంది. గూగుల్ డ్రైవ్‌లో ఉండే ఛాట్ బ్యాకప్స్‌ అన్నింటికి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవచ్చు. దీంతో వాట్సప్ మెసేజులు ఎవరూ చూడకుండా ప్రైవసీ పెరుగుతుంది. ఈ ఫీచర్ ఆన్ చేస్తే ఛాట్ బ్యాకప్స్ అన్నీ పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ అవుతాయి.

Auto Download Rules

వాట్సప్ ఓపెన్ చేస్తే చాలు తెల్లారింది మొదలు రాత్రి వరకు ఫార్వర్డ్ మెసేజెస్ కుప్పలుతెప్పలుగా వస్తుంటాయి. వాటిలో కొన్ని ఉపయోగకరమైన మెసేజులు ఉంటే మరికొన్ని అనవసర ఫోటోలు, వీడియోలు వుంటాయి. వాటిని డిలీట్ చేయడానికి కాస్త సమయం కేటాయించాల్సిందే. కానీ ఆటో డౌన్లోడ్ రూల్స్ ఫీచర్ వచ్చిన తరువాత ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, వాయిస్ మెసేజెస్ ఆటో డౌన్‌లోడ్ కాకుండా డిసేబుల్ చేసే ఆప్షన్ ఉంటుంది.

Advance Search

వాట్సప్ లో ప్రతి రోజు మెసేజెస్, ఫోటోస్, వీడియోస్, గిఫ్ ఫైల్స్ వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చే వాట్సప్ మెసేజుల్లో ఏది నిజం, ఏది ఫేక్ వార్త అన్నది తెలుసుకోలేం. అలా తెలుసుకోవడానికి ఈ అడ్వాన్స్ సెర్చ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా వచ్చిన మెసేజ్‌ను అక్కడే సెర్చ్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News