Europe Floods: భారీ వరదలతో ఒణికిపోతున్న యూరప్
Europe Floods: వరదల కారణంగా వందలాది మంది మృత్యువాత * నదులను తలపిస్తున్న నగరాల్లోని వీధులు
Europe Floods: భారీ వరదలతో యూరప్ అల్లకల్లలోలంగా మారింది. ముఖ్యంగా వెస్ట్ యూరప్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జర్మనీ, బెల్జియంలను వరదలు ముంచెత్తడంతో దాదాపు 150మంది మృత్యువాత పడ్డారు. అలాగే, వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. మరోవైపు.. జర్మనీలోని అహర్వీలర్ కౌంటీలో వరదల తాకిడికి 90మంది ప్రాణాలు కోల్పోయారు. అటు రైన్‌లాండ్-పలాటినేట్ రాష్ట్రంలో మరో 63మంది ప్రాణాలు వదిలారు
మరోవైపు నార్త్‌రైన్-వెస్ట్ ఫాలియాలో మృతుల సంఖ్య 43కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. జర్మనీలోని ఈర్ఫ్స్టాడ్ప్రాంతంలో ఆర్మీ సహయక చర్యలు కొనసాగిస్తోంది. నీటి ప్రవాహానికి అనేక ఇళ్లు కూలిపోయాయి. కార్లు, ఇతర వాహనాలు కాగితం పడవల్లా కొట్టుకుపోయాయి. ఇక.. చాలా ప్రాంతాలు ఇప్పటికీ విద్యుత్ లేక అంధకారంలోనే ఉన్నాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. జనజీవనం పూర్తిగా స్థంభించడంతో పెద్ద ఎత్తున రెస్క్యూ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్నాయి.