ప్రపంచంలో భారీ భూకంపాలు: ఎక్కడ,ఎప్పుడు జరిగాయో తెలుసా?

1960 మే 22న చిలీలోని వాల్ద్వియా ప్రాంతంలో 9.5 తీవ్రతతో భూమి కంపించింది.

Update: 2025-03-29 13:30 GMT
strongest earthquakes ever recorded in the world over the years

ప్రపంచంలో భారీ భూకంపాలు: ఎక్కడ,ఎప్పుడు జరిగాయో తెలుసా?

  • whatsapp icon

మయన్మార్, థాయ్ లాండ్ లలో సంభవించిన భూకంపాలు ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీశాయి. ఈ రెండు దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటివరకు సంభవించిన భూకంపాలను ఒకసారి తెలుసుకుందాం.

చిలీలో భూకంపం

1960 మే 22న చిలీలోని వాల్ద్వియా ప్రాంతంలో 9.5 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప ప్రభావంతో సముద్రంలో రాకాసి అలలు దక్షిణ చిలీ, హవాయి, జపాన్, పిలిఫ్పిన్స్, తూర్పు న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా తీరాలను తాకాయి. ఈ ఘటనల్లో 1655 మంది మరణించారు. మూడు వేల మంది గాయాలయ్యాయి. భూకంపంతో నాలుగు బిలియన్ డాలర్ల ఆస్తినష్టం చోటుచేసుకుంది.

చైనాలో భూకంపం

1556 జనవరి 23న చైనాలోని షాంగ్జీ ఫ్రావిన్స్ రాజధాని జియాన్ కు ఈశాన్యంగా 50 కి.మీ. దూరంలో రెక్టర్ స్కేల్ పై 8.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. 1976 జూలై 27న చైనాలో 7.5 తీవ్రతతో భూకంపం వాటిల్లింది. టాంక్ షాన్ లో వాటిల్లిన భూకంపం బీజింగ్ వరకు వ్యాపించింది. అధికారిక అంచనాల మేరకు 2,55,000 మంది మరణించారు. 400 సంవత్సరాల్లో ఇది వినాశనకరమైన భూకంపంగా చెబుతారు.

రష్యా భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన 2,336 మంది

1952లో రష్యాకు చెందిన కమ్చట్కా ద్వీపకల్పంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 9 తీవ్రత నమోదైంది. సెవెరే-కుర్లిస్క్ ప్రాంతంలో తీవ్ర ప్రభావాన్ని చూపింది.ఇక్కడ నివాసం ఉండే 6 వేల మందిలో 2,336 మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంపంతో సునామీ ఏర్పడింది.

అలస్కా‌లో భారీ భూకంపం

అమెరికాలోని అలాస్కాలో 1964 మార్చి 28న భారీ భూకంపం వచ్చింది. ఆ సమయంలో రిక్టర్ స్కేల్ పై 9.2 తీవ్రత నమోదైంది. 4.38 నిమిషాలు భూమి కంపించింది. ఇప్పటివరకు నమోదైన భూకంపాల్లో రెండో అతి పెద్దది. ఈ భూకంపంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం నుంచి పుట్టిన సునామీ అలలతో 131 మంది మరణించారు.

ఇండోనేసియాలో భూకంపం... సునామీ

ఇండోనేసియాలోని సుమత్రా తీరంలోని సముద్ర ప్రాంతంలో 2004 డిసెంబర్ 26న భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 9.1 తీవ్రత నమోదైంది. భూకంపం నుంచి పుట్టిన అలలు 14 దేశాల తీరాలను అతలాకుతలం చేశాయి. ఈ భూకంపం కారణంగా 2,27,898 మంది మరణించారు.ఈ భూకంపం భారత్ లో అండమాన్- నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు , కేరళలో దీని ప్రభావం కనిపించింది.

జపాన్ లో 9.1 తీవ్రతతో భూకంపం

జపాన్‌లో 2011లో భారీ భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పై 9.1 తీవ్రత నమోదైంది. ఈ భూకంపంతో సునామీ కూడా వచ్చింది. ఈ భూకంపంతో 15, 500 మంది చనిపోయారు. జపాన్ లో పుకుషిమా అణు రియాక్టర్ దెబ్బతింది.

Tags:    

Similar News