Hurun Global Rich List 2025: టాప్‌లో ఎలాన్ మస్క్, మూడో జాబితాలో నిలిచిన ఇండియా
2025 Hurun Global Rich List: హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 విడుదలైంది. ప్రపంచంలోని పలు దేశాల్లో 3,442 మంది బిలియనీర్ల జాబితాను ఆ సంస్థ విడుదల చేసింది.

Hurun Global Rich List 2025: టాప్‌లో ఎలాన్ మస్క్, మూడో జాబితాలో నిలిచిన ఇండియా
2025 Hurun Global Rich List: హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 విడుదలైంది. ప్రపంచంలోని పలు దేశాల్లో 3,442 మంది బిలియనీర్ల జాబితాను ఆ సంస్థ విడుదల చేసింది. అయితే గత ఏడాదితో పోలిస్తే బిలియనీర్ల జాబితా 163 పెరిగింది. బిలియనీర్ల జాబితాలో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. తొలుత అమెరికా నిలవగా , ఆ తర్వాతి స్థానాన్ని చైనా దక్కించుకుంది.
ప్రపంచ కుబేరుల్లో ఎలాన్ మస్క్ టాప్
ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో టాప్ లో నిలిచారు. ఐదేళ్లలో వరుసగా నాలుగోసారి ఆయన ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో టాప్ లో ఆయన ఉన్నారు.ఆయన ఆస్తుల విలువ 420 బిలియన్ డాలర్లు. టెస్లా స్టాక్ ధర 82 శాతం పెరిగింది. మస్క్ తర్వాత స్థానంలో అమెజాన్ కు చెందిన జెఫ్ బెజోస్ నిలిచారు. ఆయన సంపద 266 బిలియన్ డాలర్లు. ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ 242 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. జుకర్ బర్గ్ తొలిసారిగా మూడోస్థానానికి చేరుకున్నారు.
మూడు రెట్లు పెరిగిన ఎన్‌వీడియా సంపద
ఎన్వీడీఐఏ కు చెందిన జెన్సెస్ హువాంగ్ సంపద మూడు రెట్లు పెరిగింది. దీంతో ఆయన సంపద 128 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాల్లో 11వ స్థానానికి చేరుకున్నారు. డీప్ సీక్ సీఈఓ లియాంగ్ వెన్ఫెంగ్, ఓపెన్ ఏఐ సామ్ ఆల్ట్ మాన్ తొలిసారిగా హురున్ గ్లోబల్ రిచ్ జాబితాలో చోటు దక్కింది. డీప్ సిక్ సీఈఓ సంపద నికర విలువ 4 బిలియన్ డాలర్లు, సామ్ ఆల్ట్ మాన్ సంపద 1.8 బిలియన్ డాలర్లు.
హురున్ నివేదిక ప్రకారంగా ఐదు శాతం బిలియనీర్ల సంఖ్య పెరిగింది. వీరి సంపద 13 శాతం పెరిగింది. అయితే 1260 మంది సంపన్నుల సంపద గత ఏడాదితో పోలిస్తే కొంత తగ్గింది. 399 మంది సంపన్నుల లిస్టులో ఎలాంటి తేడా రాలేదు.
ప్రపంచంలో సంపన్నుల జాబితా
1 . ఎలాన్ మస్క్ 4208 బిలియన్ డాలర్లు
2. జెఫ్ బోజోస్ 266 బిలియన్ డాలర్లు
3 . మార్క్ జుకెన్ బర్గ్ 242 బిలియన్ డాలర్లు
4. లారీ ఎల్లిసన్ 203 బిలియన్ డాలర్లు
5. వారెన్ బఫెట్ 167 బిలియన్ డాలర్లు
6. లారీ ఫేజ్ 164 బిలియన్ డాలర్లు
7.బెర్నార్ ఆర్నాల్డ్ 157 బిలియన్ డాల్లు
8.స్టీవ్ బాల్మెర్ 156 బిలియన్ డాలర్లు
9.సెర్గీబ్రిన్ 148 బిలియన్ డాలర్లు
10. బిల్ గేట్స్ 143 బిలియన్ డాలర్లు