Trump's reciprocal tariffs: ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్‌తో ఇండియాలో ప్రభావితం అయ్యే రంగాలు ఇవే!
Trump's reciprocal tariffs: ట్రంప్ కొత్త టారిఫ్ విధానంలో భారత టెక్స్‌టైల్ రంగమే ప్రధానంగా నష్టపోనుంది. అమెరికా మార్కెట్‌పై ఎక్కువ ఆధారపడటం ఇప్పుడు సమస్యగా మారింది.

Trump's reciprocal tariffs: ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్‌తో ఇండియాలో ప్రభావితం అయ్యే రంగాలు ఇవే!
Trump's reciprocal tariffs: డొనాల్డ్ ట్రంప్ కొత్త రెసిప్రోకల్ టారిఫ్ విధానంతో ఇండియా ఆర్థికంగా ఎదుర్కొబోయే అసలైన సవాలు టెక్స్‌టైల్ రంగంలోనే ఉంది. ఆటోమొబైల్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలకంటే కూడా ఎక్కువ ప్రమాదంలో ఉన్న రంగం ఇదే అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
2023–24లో భారత్ నుంచి మొత్తం USD 36 బిలియన్ల విలువైన టెక్స్‌టైల్స్ ఎగుమతులు జరిగినవాటిలో దాదాపు 28 శాతం ఉత్పత్తులు అమెరికాకే వెళ్లాయి. కొన్ని కేటగిరీలలో అయితే ఈ ఆధారపడటం మరింత తీవ్రమైంది. కార్పెట్లు, మేక్‌అప్ టెక్స్‌టైల్స్, కోటెడ్ ఫ్యాబ్రిక్స్ వంటి వాటిలో 50 శాతం పైగా ఎగుమతులు అమెరికా మార్కెట్‌కే జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ డిపెండెన్సీ అమెరికాకు మాత్రం అంత పెద్దగా లేదు. 2024లో అమెరికా టెక్స్‌టైల్స్ దిగుమతుల్లో భారత్ వాటా కేవలం 6 శాతం మాత్రమే. అదే సమయంలో చైనా 21 శాతం, వియత్నాం 19 శాతం, బాంగ్లాదేశ్ 9 శాతం మార్కెట్‌ను నియంత్రిస్తున్నాయి.
ఒక్కవేళ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 10 శాతం అదనపు టారిఫ్ వేసిందని ఊహిస్తే, భారత ఎగుమతులు USD 5.9 బిలియన్ల మేరకు పడిపోవచ్చని అంచనా. ఇందులో ప్రధానంగా రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులు, అప్పారెల్ రంగమే ఎక్కువ దెబ్బ తినబోతున్నాయి. ఒక్క అప్పారెల్ రంగంలోనే USD 1 బిలియన్‌కి పైగా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇక ట్రంప్ ప్రభుత్వం ఇటీవలి మాటల ప్రకారం, ఇండియా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం వరకు టారిఫ్ వేశారని, అందుకే అమెరికన్ ఎగుమతులు పోటీ పడలేకపోతున్నాయని భావిస్తోంది. దీంతో ప్రతీకారంగా భారత్ ఎగుమతులపై నిషేధాలు రావడం ఖాయమే.