Snakes Honeymoon: పాముల హనీమూన్ స్పాట్ గురించి తెలుసా? ఇక్కడికి ప్రతిఏటా 75వేలకు పైగా పాములు చేరుకుంటాయ్

Snakes Honeymoon: పాము కనిపిస్తే ఏం చేస్తారు..భయంతో పరుగెడుతుంటారు. అదే ఒకే చోట వందల పాములు ఉంటే..ఊహించుకునేందుకు కూడా ధైర్యం సరిపోవడం లేదు కదా. అవును అలాంటి ప్రాంతం ఒకటి ఉంది. అక్కడ వేల పాములు కలుసుకుంటాయి. ఎక్కడో చూద్దామా.
కెనడాలోని మానిటోబాలో నార్సిస్సే అని పట్టణంలో ప్రతి వసంతకాలంలో ఓ అద్భుత సంఘటన జరుగుతుంది. ఈ సీజన్ లో ఇక్కడికి దాదాపు 75లకు పైగా పాములు వలస వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ కౌంట్ 15వేలు కూడా దాటుతుంది. ఇక్కడికి వచ్చే పాములు రెడ్ సైడెడ్ ఈస్టర్న్ గార్టర్ జాతి పాములు. ప్రతిఏడాది మార్చి నుంచి జూన్ వరకు ఇక్కడు భారీ సంఖ్యలో ఒకే చోట ఉండే సర్పాలను చూసేందుకు శాస్త్రవేత్తలు ఆసక్తి చూపుతారు. ఈ పాములు శీతాకాలంలో దాక్కున్న ప్రదేశాల నుంచి బయటకు వస్తుంటాయి. వెచ్చదనం కోసం, సంభోగం కోసం తోడును వెతుక్కుంటూ వలస వస్తుంటాయి. అందుకే దీనిరి పాముల హనీమూన్ అంటారు.
కెనడాలో చలికాలం ముగిసిన తర్వాత పాముల వలస షురూ అవుతుంది. శీతాకాలంలో పాములు సున్నపురాయి రాయి పగుళ్లతో చేసిన భూగర్భ గుహలలో నిద్రాణస్థితిలో ఉంటాయి. ఈ ప్రాంతాలు వాటిని గడ్డకట్టే వాతావరణం నుంచి సురక్షితంగా ఉంచుతాయి. వసంతకాలం వచ్చినప్పుడు మగపాములు ముందుగా మేల్కొని బయటకు వచ్చి జత కోసం యి. సరైన తోడుగా భావించే ఆడ పాములతో కలిసి ఉంటాయి.
ఈ పాముల కలయిక కేవలం ఓ సంఘటన మాత్రమే కాదు ఇది ప్రక్రుతికి కూడా చాలా ముఖ్యం. పాములు ఎలా జీవిస్తాయి..ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు అవకాశం కల్పిస్తుంది. చాలా మంది టూరిస్టులు ఈ ప్రాంతానికి వస్తుంటారు.