Rocket crashed: నింగిలోకి ఎగిసిన రాకెట్ మళ్లీ భూమివైపు దూసుకొచ్చింది.. చివరకు...

Update: 2025-03-30 14:45 GMT
Spectrum rocket built by German company Isar Aerospace crashed after launching from Norways Andoya Spaceport in Arctic region

Rocket crashed: నింగిలోకి ఎగిసిన రాకెట్ మళ్లీ భూమివైపు దూసుకొచ్చింది.. చివరకు...

  • whatsapp icon

Rocket crashed after launching: నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లే రాకెట్ ఉన్నట్లుండి మళ్లీ యూటర్న్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అంతరిక్షంలోకి వెళ్లాల్సిన రాకెట్ నేల చూపులు చూస్తూ కిందకు దూసుకొస్తే ఎలా ఉంటుంది? ఆదివారం నార్వేలోని ఆర్కిటిక్ ప్రాంతంలోని అండోయ స్పేస్ పోర్ట్ అంతరిక్ష ప్రయోగకేంద్రంలో శాస్త్రవేత్తలకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

జెర్మనీకి చెందిన ఇసార్ ఏరోస్పేస్ అనే కంపెనీ తయారు చేసిన ఆర్బిటల్ స్పెక్ట్రం రాకెట్‌ను ఆదివారం నార్వేలో లాంచ్ చేశారు. రాకెట్ లాంచ్ అయిన కొన్ని సెకన్లలోనే సాంకేతిక లోపం తలెత్తింది. రాకెట్ కింది భాగంలో మంటలు ఆగిపోవడంతో రాకెట్ పొగలు కక్కుతూ యూటర్న్ తీసుకుంది. క్షణాల వ్యవధిలోనే నేలను ఢీకొని భారీ శబ్ధంతో పేలిపోయింది. అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ఈ రాకెట్స్‌ను ఉపయోగిస్తుంటారు.

రష్యాను మినహాయిస్తే... యూరోపియన్ నేలపై జరిగిన తొలి ఆర్బిటల్ వెహికిల్ లాంచ్ ప్రయోగం ఇది. కానీ తొలి ప్రయోగమే విఫలం కావడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది.

అయినప్పటికీ తొలి ప్రయోగంలో ఇలాంటి అనుభవాలు సహజమే అని ఆ కంపెనీ సహ వ్యవస్థాపకులు డానియెల్ మెజ్లర్ అన్నారు.  

Tags:    

Similar News