ఆయుధాలు వదిలేయండి.. ఉక్రెయిన్ సోల్జర్స్‌కు రష్యా అల్టిమేటమ్
Ukraine Russia War: ప్రపంచదేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నా రష్యా మాత్రం ఉక్రెయిన్ పై దూకుడు పెంచుతోంది.
Ukraine Russia War: ప్రపంచదేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నా రష్యా మాత్రం ఉక్రెయిన్ పై దూకుడు పెంచుతోంది. ఇప్పటికే పోర్ట్ సిటీ మరియూపోల్ ను స్వాధీనం చేసుకున్న రష్యా ఇప్పుడు రాజధాని కీవ్ వైపు దూసుకెళ్తోంది. కీవ్ ముట్టడి దిశగా పుతిన్ సేనలు అడుగులు వేస్తోంది. రష్యా దాష్టీకాలపై విమర్శల వెల్లువెత్తుతున్నా మరియూపోల్ విధ్వంసంపై వరల్డ్ వైడ్ విమర్శలు వచ్చినా రష్యా సేనలు వెనక్కి తగ్గడం లేదు.
ఓవైపు యుద్ధంలో దూకుడు పెంచుతూనే మరోవైపు తాజాగా ఉక్రెయిన్ బలగాలకు ఆదేశాలిస్తోంది. యుద్ధం ఆపి వెనక్కి వెళ్లిపోండంటూ ఉక్రెయిన్ సైనికులకు హితవు పలుకుతోంది. ప్రాణాలు కాపాడుకోండంటూ హెచ్చరిస్తోంది. లేదంటే ఇక మీ ఇష్టమని రష్యా సైన్యం తెగేసి చెబుతోంది. తక్షణం ఆయుధాలు వదిలేయాలని అల్టిమేటమ్ జారీ చేసింది. రష్యా సేనలను అడ్డుకోవాలని చూస్తే ప్రాణాలపై ఆశ లేనట్టేనంది. ప్రతిఘటన వల్ల ఒరిగేదేమీ ఉండదని లొంగిపోయినవారిని ఏమీ చేయబోమని రష్యా ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా కాదని యుద్ధం చేస్తామంటే ఇకే చేసేదేమీ ఉండబోదంది. తాజాగా ఇందుకు సంబంధించి రష్యా క్లారిటీ ఇచ్చింది.