Plane Crash: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు.. న్యూయార్క్ లో కుప్పకూలిన మరో ఫ్లైట్

Update: 2025-04-13 03:24 GMT
Plane Crash: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు.. న్యూయార్క్ లో కుప్పకూలిన మరో ఫ్లైట్
  • whatsapp icon

Plane Crash: అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మొన్న న్యూయార్క్ సిటీలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఓ కంపెనీ సీఈఓ కుటుంబం దుర్మరణం చెందింది. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి సీఈఓ అగస్టన్ ఎస్కోబార్ తన ఫ్యామిలీతో కలిసి హడ్సన్ నది మీదుగా వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎస్కోబార్, ఆయన భార్య ముగ్గురు పిల్లలతో సహా పైలట్ మరణించిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో విమానం ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం కొలంబియాలోని కౌంటి ఎయిర్ పోర్టుకు వెళ్తున్న ట్విన్ ఇంజిన్ విమానంలో ఓ పొలంలో కుప్పకూలింది. కొలంబియా కౌంటీ అండర్ షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ విమాన ప్రమాదానికి సంబంధించి మరణించిన వారి వివరాలను వెల్లడించలేదు. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. మిత్సిబిషి ఎమ్ యూ 2 బీ విమానం కొలంబియాలోని కౌంటీ ఎయిర్ పోర్టకు బయలుదేరింది. కోపాకేకు 30మైళ్ల దూరంలో ఉండగానే ఓ పొలంలో కుప్పకూలింది. వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News