America News: ఇండియన్స్‌కు పెరుగుతున్న వీసా సమస్యలు.. షాకింగ్ సర్వే!
America News: వీసా వచ్చిందంటే జీవితం సెట్ అయిపోయిందన్న నమ్మకం ఇప్పుడిప్పుడే తుడిచిపెట్టుకుపోతుంది. ఎప్పుడు.. ఏ మెయిల్ వస్తుందోననే భయంతో విద్యార్థులు ఉంటున్నారు.

Trump: పహల్గాం దాడి చెత్తపని..పరిష్కారం భారత్ -పాక్ చేతుల్లోనే..ఇలా అనేశాడేంటీ?
America News: అమెరికా అంటేనే భయంపుడుతుంది..! ఎప్పుడు.. ఏం జరుగుతుందో అర్థంకాని దుస్థితి. ఒకప్పుడు భారతీయులకు డ్రీమ్ నేషన్‌గా ఉన్న అమెరికా ఇప్పుడు కలలను చంపేసే దేశంగా మారింది. అమెరికా వెళ్లి సెటిల్ కావాలనేది లక్షల మంది భారతీయ విద్యార్థుల కల. వీసా వస్తే చాలు.. జీవితమే మారిపోతుందని భావించే వారు లక్షల్లో ఉంటారు. అయితే కొత్త గేట్లు తెరుచుకున్నట్టే తెరుచుకోని.. ఆ వెంటనే మూసుకుపోతే? చదువు పూర్తి చేసి జాబ్‌లో అప్పుడప్పుడే సెటిల్ అవుతున్న వారిని కూడా గెంటేస్తే? అవును..! ఇప్పుడు అమెరికాలో భారతీయుల దుస్థితి ఇది. మీ వీసా రద్దయిందంటూ ఇండియన్స్‌కు వరుసపెట్టి మెయిల్స్ వస్తుండడం సంచలనం రేపుతోంది. ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతోంది? భారతీయుల వీసాలే ఎక్కువగా ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి?
అటు అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ఒక షాకింగ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఇటీవల 327 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే.. అందులో సగం మంది భారతీయులే ఉన్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే తమ చదువు పూర్తి చేసి.. ఉద్యోగాల్లో చేరి.. చాలా సంవత్సరాలగా అమెరికాలోనే ఉంటున్నారు. వీళ్లలో 65 శాతం మంది OPTపై ఉద్యోగం చేస్తున్నారు. OPT అంటే Optional practical training. ఈ ప్రొగ్రామ్ ప్రకారం.. F-1 వీసాలతో తాత్కాలికంగా అమెరికాలో జాబ్ చేయవచ్చు. ఇలా ఉద్యోగం చేస్తున్న వారి వీసాలు ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా రద్దవుతున్నాయి. ఆ వీసా రద్దుకు కారణాలేంటో స్పష్టంగా చెప్పడంలేదు. ఒక్క మెయిల్‌తో ఉద్యోగుల స్టేటస్‌ను టెర్మినేట్ చేసి పడేస్తున్నారు. కొంతమందికి చిన్నచిన్న కారణాలు చూపుతూ వీసాలు రద్దు చేస్తోంది. కొన్ని కేసుల్లో స్పీడింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, వాహనం ఆపకపోవడం లాంటి చిన్నచిన్న ట్రాఫిక్ తప్పులనే పెద్ద కారణాలుగా చూపించి మరీ వీసాలు రద్దు చేస్తున్నారు. ఈ అనూహ్య పరిణామాలతో అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు.
ఇక ఇంత మంది భారతీయ విద్యార్థుల వీసాలు రద్దవడం వెనుక అసలు కారణాలు ఏంటన్నది ఇప్పుడు అందరికీ పెద్ద ప్రశ్న. అధికారికంగా స్పష్టత లేకున్నా.. ఈ పరిణామాల వెనక కొన్ని అంశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటిగా.. భారతీయ విద్యార్థుల సంఖ్య అమెరికాలో ఇతర దేశాలతో పోలిస్తే భారీగా ఉంటుంది. 2025లో 11 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో మూడున్నర లక్షల మందికి పైగా భారతీయులే ఉన్నారు. అందులో కూడా దాదాపు లక్ష మంది OPTపై ఉద్యోగాల్లో ఉన్నారు. అలాగే.. చిన్నచిన్న పోలీస్ కేసులు, ట్రాఫిక్ కేసులతో వీరందరిని ఇంటికి పంపుతుండడం అత్యంత దుర్మార్గంగా చెప్పవచ్చు. ఇదంతా చూస్తుంటే.. అమెరికాలో చదువుకునే భారతీయులకు భద్రత లేదన్న భయం స్పష్టంగా కనిపిస్తోంది. వీసా వచ్చిందంటే జీవితం సెట్ అయిపోయిందన్న నమ్మకం ఇప్పుడిప్పుడే తుడిచిపెట్టుకుపోతుంది. ఎప్పుడు.. ఏ మెయిల్ వస్తుందోననే భయంతో విద్యార్థులు ఉంటున్నారు. ఇక అంతా తెలిసి జాగ్రత్తగా ఉన్నా.. ఎందుకో ఇండియన్స్ వీసాలే ఎక్కువగా క్యాన్సిల్ అవుతుండడం నిజంగా విడ్డూరం!