Hindu Leaders Attacked: నిన్న బంగ్లాదేవ్‌.. ఇవాళ పాకిస్థాన్‌.. శత్రుదేశాల్లో హిందు నేతలపై దాడులు!

Hindu Leaders Attacked: హిందువులు, క్రిస్టియన్లు, తరచూ వివక్ష, బలవంతపు మతమార్పిడులు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు గుర్తించాయి.

Update: 2025-04-20 13:27 GMT
Hindu Leaders Attacked

Hindu Leaders Attacked: నిన్న బంగ్లాదేవ్‌.. ఇవాళ పాకిస్థాన్‌.. శత్రుదేశాల్లో హిందు నేతలపై దాడులు!

  • whatsapp icon

Hindu Leaders Attacked: పాకిస్తాన్‌లో మైనారిటీ హక్కులపై కొనసాగుతున్న విమర్శల మధ్య ఓ ఘర్షణాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. సింధ్ ప్రావిన్స్‌లో జరిగిన నిరసనల మధ్య హిందూ మంత్రిపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వ మత విషయాల శాఖ మంత్రి ఖేల్ దాస్ కోహిస్తానీ కాన్వాయ్‌పై నిరసనకారులు బంగాళదుంపలు, టమోటాలు విసిరారు. సింధ్‌లోని థట్టా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కాలువల ప్రాజెక్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ కింద పంజాబ్‌లో ఆరు కాలువల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించగా, ఇది సింధ్‌కు నీటి సరఫరాను తగ్గిస్తుందని స్థానికులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జరిగిన నిరసనలో కోహిస్తానీ కాన్వాయ్ అక్కడకు చేరిన సమయంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. బంగాళదుంపలు, టమోటాలతో ఆయన వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలానే, సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా కూడా స్పందిస్తూ ఈ దాడిని ఖండించారు. హైదరాబాదు ప్రాంతానికి చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు నిందితుల అరెస్ట్‌కు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు, క్రిస్టియన్లు, తరచూ వివక్ష, బలవంతపు మతమార్పిడులు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు గుర్తించాయి. అలాంటి సమయంలో మతపరమైన పరస్పర గౌరవాన్ని నెరవేర్చాల్సిన పరిస్థితిలో ఓ హిందూ మంత్రిపై దాడి జరిగిందన్నది ఆందోళన కలిగించే విషయం. కోహిస్తానీ సింధ్‌లోని జంషోరో జిల్లాకు చెందినవారు. 2018లో తొలిసారి ఎంపీగా ఎన్నికై, తర్వాత 2024లో మరోసారి విజయం సాధించి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈ దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన మైనారిటీ మంత్రుల భద్రతపై ప్రశ్నలు తలెత్తిస్తోంది.

Tags:    

Similar News