Nepal Crisis: రోడ్డెక్కిన నేపాల్.. తన్నులాటలు, కొట్లాటలతో దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు!

Nepal Crisis: నేపాల్‌లో రాజ్యాంగ గణతంత్ర వ్యవస్థకు వ్యతిరేకంగా, రాజతంత్రాన్ని మళ్లీ తీసుకురావాలన్న డిమాండ్‌తో నిరసనలు జోరుగా సాగుతున్నాయి. రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Update: 2025-03-28 16:30 GMT
Nepal Crisis

Nepal Crisis: రోడ్డెక్కిన నేపాల్.. తన్నులాటలు, కొట్లాటలతో దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు!

  • whatsapp icon

Nepal Crisis: నేపాల్ రాజధాని కాఠ్మండులో ఘర్షణలు, అరాచకతకు దారితీసిన పెద్ద స్థాయి నిరసనలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు రాజతంత్రాన్ని మళ్లీ తీసుకురావాలంటూ రాజాభిమానులు, మరోవైపు ప్రస్తుత గణతంత్ర వ్యవస్థకు మద్దతుగా రిపబ్లికన్ వాదులు జొరుగా రోడ్డెక్కారు. రెండు వర్గాల వేర్వేరు ప్రదర్శనలు ఒకేసారి జరుగుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తింకుణే ప్రాంతంలో వేలాది మంది రాజతంత్ర మద్దతుదారులు భారీగా జమయ్యారు. దేశాన్ని రక్షించేందుకు రాజు మళ్లీ రావాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన అవినీతిపరమైందని, మళ్లీ హిందూ రాజ్యం రావాలంటూ ఆందోళనను ఉదృతం చేశారు. ఈ నిరసనలకు రాష్ట్రీయ ప్రజతంత్ర పార్టీతో పాటు మరోకటీగా ఉన్న హిందూ మతపరమైన మరియు రాయల్టీ మద్దతు గల గుంపులు నాయకత్వం వహించాయి.

అటు నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. విధ్వంసాన్ని నియంత్రించేందుకు పోలీసులు తింకుణే, భృకుటిమండప ప్రాంతాల్లో భారీ బలగాలను మోహరించారు.

మరోవైపు నగర కేంద్రంలో భృకుటిమండప వద్ద గణతంత్ర వ్యవస్థకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారు. దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన గణతంత్ర పాలనను కొనసాగించాలంటూ మద్దతుదారులు నినాదాలు చేశారు. అవినీతిపై చర్యలు తీసుకోవాలని, పాత రాజ్యాంగ వ్యవస్థలను తిరిగి తీసుకురావద్దని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలకు కమ్యూనిస్టు పార్టీలు ముఖ్యంగా మావోయిస్టు కేంద్రం, ఏకీకృత సోషలిస్టు పార్టీలు మద్దతుగా నిలిచాయి. మావోయిస్టు అధినేత పుష్పకమల్ దహాల్ ప్రచండ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు భృకుటిమండప వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

ఇటీవలి కాలంలో రాజతంత్ర మద్దతుదారులు బలపడటానికి ప్రధాన కారణం, మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఇటీవల ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశం. ఈ సందేశంలో ఆయన హిందూ రాజ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ప్రజలను కోరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు నేపాల్ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతకు దారి తీసే అవకాశాన్ని చూపుతున్నాయి.



Tags:    

Similar News