Myanmar earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం... 3 నిమిషాలు షేక్ అయిన బిల్డింగ్స్, బయటికి పరుగులు తీసిన జనం

Update: 2025-03-28 07:41 GMT
Myanmar earthquake

Myanmar earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం... షేక్ అయిన బిల్డింగ్స్, బయటికి పరుగులు తీసిన జనం

  • whatsapp icon

Myanmar earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.7 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైంది. బిల్డింగ్స్ షేక్ అయ్యాయి. దీంతో జనం భవంతులకు దూరంగా పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మయన్మార్‌లో భారీ అంతస్తుల భవనాలు పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. 

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఈ భూకంపం సంభవించింది. సగైంగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 10 కిమీ లోతున భూకంప కేంద్రం ఉందని గుర్తించినట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది.

మయన్మార్‌లో భారీ భూకంపం తాకిడికి పొరుగు దేశమైన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోనూ ప్రకంపనలు కనిపించాయి. బ్యాంకాక్ లో దాదాపు 3 నిమిషాల పాటు ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అక్కడి నెటిజెన్స్ చెబుతున్నారు. 3 నిమిషాల పాటు పెద్ద పెద్ద భవనాలు కూడా షేక్ అయ్యాయంటూ వీడియోలు పోస్ట్ చేశారు.

బ్యాంకాక్‌లో భారీ అంతస్తుల భవనాలు షేక్ అవడంతో వాటి పై నుండి దుమ్ముదూళి కిందపడటం వీడియోల్లో చూడొచ్చు. స్విమ్మింగ్ పూల్‌ను ఎవరో ఊపేసినట్లుగా అందులో నీరు కూడా సముద్రంలో అలల తరహాలో అటుఇటు కదలడం కనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్యాంకాక్ లో రైలు, మెట్రో రైలు సేవలు నిలిపేశారు.

ఈ భూకంపం తీవ్రత ప్రభావం పొరుగు దేశమైన చైనాలోనూ కనిపించింది. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో మెట్రో రైలు సేవలు నిలిపేసినట్లు బీజింగ్ క్వేక్ ఏజెన్సీ వెల్లడించింది. 

Tags:    

Similar News